అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’ – ప్రారంభం

అక్షయ్ కుమార్, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ జంటగా చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ‘పృథ్వీరాజ్’ సినిమా ప్రారంభం..

  • Published By: sekhar ,Published On : November 16, 2019 / 10:10 AM IST
అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’ – ప్రారంభం

Updated On : November 16, 2019 / 10:10 AM IST

అక్షయ్ కుమార్, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ జంటగా చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ‘పృథ్వీరాజ్’ సినిమా ప్రారంభం..

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్న హిస్టారికల్ మూవీ ‘పృథ్వీరాజ్’.. మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ కథానాయికగా తెరంగేట్రం చేస్తోంది. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ‘పృథ్వీరాజ్’ శుక్రవారం ముంబయిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

అక్షయ్, మానుషి, దర్శకుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘పృథ్వీరాజ్‌’ సినిమాలో చక్రవర్తి ప్రేమికురాలు రాణి సంయోగితగా మానుషి నటిస్తుంది. ‘‘ఫస్ట్ ఫిలిం యశ్‌రాజ్ బ్యానర్లో చేయడం, అందులోనూ అక్షయ్ వంటి స్టార్ హీరోతో నటించడం.. పైగా హిస్టారికల్ మూవీ, అందులోనూ రాణి సంయోగిత క్యారెక్టర్ చేయడం హ్యాపీగా ఉంది.. వంద శాతం ఈ పాత్రకు న్యాయం చేస్తాను.. ఇప్పుడే నటిగా బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగు పెట్టాను.. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి’’ అని మానుషి చిల్లర్ చెప్పింది.  

Read Also : ఆమని బర్త్‌డే సందర్భంగా ‘అమ్మదీవెన’ – ఫస్ట్‌లుక్ రిలీజ్

‘‘సంయోగిత రోల్ కోసం అందమైన, విశ్వాసం కలిగిన అమ్మాయి కావాలి.. చాలా మందిని ఆడిషన్ చేశాం.. చివరకి ఆ లక్షణాలు మాకు మానుషిలో కనబడ్డాయి. అందుకే ఆమెను సెలెక్ట్ చేశాం’’ అని దర్శకుడు చెప్పారు. త్వరలో ‘పృథ్వీరాజ్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 2020 దీపావళికి విడుదల చేయనున్నారు.