‘వైకుంఠపురములో’ వీడియో సాంగ్ వచ్చేసింది!
‘అల వైకుంఠపురములో’.. టైటిల్ సాంగ్ ఫుల్ వీడియో విడుదల..
‘అల వైకుంఠపురములో’.. టైటిల్ సాంగ్ ఫుల్ వీడియో విడుదల..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్..‘అల వైకుంఠపురములో’.. సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచి మరో మూడు రోజుల్లో 50 రోజుల్లో పూర్తి చేసుకునుందీ చిత్రం. ఇప్పటివరకు ‘ఓ మైగాడ్ డాడీ’, ‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్స్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
తాజాగా ‘వైకుంఠపురములో’ టైటిల్ సాంగ్ (వీడియో) విడుదల చేశారు. బంటు క్యారెక్టర్ ‘వైకుంఠపురము’లోకి ఎంటరయ్యే సందర్భంలో వచ్చే ఈ పాట లిరికల్‌గానూ విజువల్గానూ ఆకట్టుకుంటోంది.
థమన్ ట్యూన్, కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్, శ్రీ కృష్ణ, ప్రియా సిస్టర్స్ వాయిస్, బన్నీ స్టెప్స్, ఎక్స్‌ప్రెషన్స్‌కి మురళీ శర్మ కన్ఫ్యూజన్, సుశాంత్ నటన ఈ పాటలో హైలెట్ అయ్యాయి. ప్రస్తుతం సన్ నెక్స్ట్లో ‘అల వైకుంఠపురములో’ స్ట్రీమింగ్ అవుతోంది.