Ram Charan – Alia Bhatt : రామ్ చరణ్ అలియా భట్ కూతురు రాహా కోసం ఇంత మంచి పని చేశాడా..? నువ్వు గ్రేట్ బాసు..
తాజాగా అలియా భట్ ఓ ఇంటర్వ్యూలో చరణ్ గురించి ఆసక్తికర విషయం తెలిపింది.

Alia Bhat Says about Interesting Thing done by Ram Charan for her Daughter Raha
Ram Charan – Alia Bhatt : రామ్ చరణ్, అలియా భట్ RRR సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సమయంలో, ప్రమోషన్స్ లో వీరిద్దరూ క్లోజ్ అయ్యారు. చరణ్, అలియా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. తాజాగా అలియా భట్ ఓ ఇంటర్వ్యూలో చరణ్ గురించి ఆసక్తికర విషయం తెలిపింది. అలియా భట్ నటించిన జిగ్ర సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయింది.
Also Read : Find Actress : ఈ క్యూట్ పాపాయిని గుర్తుపట్టారా..? ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఈ ఫొటో షేర్ చేసి..
ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో అలియా భట్ చరణ్ గురించి మాట్లాడుతూ.. చరణ్ నేను RRR సమయంలో క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. ఒకరోజు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒకరు వచ్చి ఏనుగు వచ్చింది అని చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను. రామ్ చరణ్ సర్ మీకు ఏనుగుని పంపించారు అని చెప్పారు. దాంతో నిజమైన ఏనుగు మా ఇంటికి వచ్చిందేమో అనుకున్నాను. అయితే అది రియల్ ఎలిఫెంట్ కాదు. అది చెక్కతో తయారుచేసిన ఏనుగు. చాలా క్యూట్ గా ఉంది. అది రాహా కోసం గిఫ్ట్ గా పంపించాడు. చరణ్ రాహా పేరు మీద అడవిలో ఒక ఏనుగును దత్తత తీసుకున్నాడు. ఆ విషయం ఇలా రాహాకు ఏనుగు బొమ్మ పంపించి తెలిపాడు. అది నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఆ ఏనుగు బొమ్మ మా డైనింగ్ టేబుల్ పక్కనే పెట్టాము. రాహా దాని మీద కూర్చొని తింటుంది. ఇది మనసుకు దగ్గరైన వాళ్లకు, నిజమైన స్నేహితులు చేస్తారు అని తెలిపింది.
Charan gifts a huge toy elephant for the baby girl Raha – Alia
Charan and Alia's bond ❤️#RamCharan#AliaBhatt pic.twitter.com/GopZfKgYGc— Harthik🚁 (@alwaysharthik) October 11, 2024
దీంతో చరణ్ అలియా భట్ కూతురు కోసం ఇంత మంచి పని చేశాడా అని అభిమానులు, నెటిజన్లు చరణ్ ని అభినందిస్తున్నారు. అలాగే చరణ్ – అలియా మధ్య ఇంత మంచి స్నేహం ఏర్పడిందా అని ఆశ్చర్యపోతున్నారు.