Find Actress : ఈ క్యూట్ పాపాయిని గుర్తుపట్టారా..? ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఈ ఫొటో షేర్ చేసి..
ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న ఈ క్యూట్ పాపాయి ఎవరో అనుకుంటున్నారా..

Find This South Actress Who Shares her Childhood Photo goes Viral in Social Media
South Actress : ఇటీవల మన సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు అప్పుడప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ స్టార్ హీరోయిన్ తనే స్వయంగా తన చిన్ననాటి ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న ఈ క్యూట్ పాపాయి ఎవరో అనుకుంటున్నారా..
ఈ ఫొటోలో గౌను వేసుకొని, రెండు పిలకలు వేసుకొని, క్యూట్ గా నవ్వుతూ కూర్చున్న పాపాయి ఎవరో కాదు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. తాజాగా అనుపమ పరమేశ్వరన్ ఈ చిన్ననాటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటో చూసి ఫ్యాన్స్, నెటిజన్లు చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉందో అనుపమ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రేమమ్ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ అఆ సినిమాతో తెలుగులో పరిచయం అయింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తుంది అనుపమ. ఇటీవలే టిల్లు స్క్వేర్ సినిమాలో హాట్ హాట్ గా రొమాన్స్, ముద్దు సీన్స్ తో రెచ్చిపోయింది కూడా ఈ అమ్మడు. ప్రస్తుతం అనుపమ చేతిలో అరడజను వరకు తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలు ఉన్నాయి.