Alia Bhatt : నాకు పక్షవాతం వచ్చిందా? ఏంటి తమాషా చేస్తున్నారా.. ఆ రూమర్స్ పై ఆలియా ఫైర్

Alia Bhatt fire on those rumours

Alia Bhatt : బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదురుకుంటుంది. మనం చూస్తూనే ఉన్నాం.. ఇప్పటికే చాల మంది సినీ సెలెబ్రిటీస్ ను టార్గెట్ చేస్తూ ఆకతాయిలు ఇలాంటి పనులు చేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా హీరోయిన్స్ ముక్కుకి, మూతికి సర్జరీ చేయించున్నారని వార్తలు స్ప్రేడ్ చేస్తున్నారు.

ఆలియా కూడా ఇప్పుడు ఇదే ట్రోల్స్ బారిన పడింది. కొన్ని రోజులుగా ఈ ట్రోల్స్ రావడంతో విసిగిపోయిన ఆమె తన ఎక్స్ వేదికగా స్పందించి ఫైర్ అయ్యింది. ఏంటి.. నా నవ్వు వంకరగా ఉందా, నాకు పక్షవాతం వచ్చిందా, ఏంటి తమాషా చేస్తున్నారా.. ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు. ఇలాంటి రూమర్స్ పుట్టించడంలో అమ్మాయిలు కూడా ఉండడం సిగ్గుచేటు, ఇప్పటికే చాలా మంది నటీ నటుల పర్సనాలిటీపై ఇలాంటి రూమర్స్ వచ్చాయి. వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలీవుడ్ డిమాండ్ చేస్తుంది.

Also Read : Suriya : కార్తీని చూస్తే అసూయగా ఉంటుంది.. సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు..

మీలాంటి వాళ్ళు యవత మైండ్ పాడుచేస్తున్నారు. ఇలాంటి బాడీషేమింగ్ ట్రోల్స్ దారుణం, ఎవరి పర్సనల్ లైఫ్ లో వారికి పర్సనల్ ఛాయిస్ ఉంటుంది. వ్యక్తిగతంగా వారిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. అయితే ఆలియా లాంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి వాటిపై స్పందించడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం తన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.