Suriya : కార్తీని చూస్తే అసూయగా ఉంటుంది.. సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు..

Suriya : కార్తీని చూస్తే అసూయగా ఉంటుంది.. సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు..

Hero Suriya feels jealous on Hero karthi

Updated On : October 27, 2024 / 11:57 AM IST

Suriya : తమిళ స్టార్ హీరో సూర్య త్వరలోనే కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ చెయ్యనున్నారు. రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో ఇప్పటికే కంగువ సినిమాకి సంబందించిన మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇక ఇటీవల దీనికి సంబందించిన ఓ ప్రెస్ మీట్ లో సూర్య ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే.

Also Read : Miheeka Daggubati : బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న రానా భార్య.. వీడియో చూశారా..?

తాజాగా కంగువ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా తెలుగు బుల్లితెర టాప్ షో అయిన బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చారు. సూర్యతో పాటు కంగువ డైరెక్టర్ శివ, నిర్మాత జ్ఞానవేల్ రాజా కూడా వచ్చారు. తమ సినిమాకి సంబందించిన చాలా విషయాలను తెలిపారు. అలా సూర్య మాట్లాడుతున్న సమయంలో.. ఎంత చక్కాగా తెలుగు మాట్లాడుతున్నావ్ అని నాగ్ అన్నారు. అప్పుడు సూర్య నవ్వుతూ.. లేదన్న నేను ఇంకా పర్ఫెక్ట్ గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. ఈ విషయంలో నేను  కార్తీ పై ఎప్పుడూ అసూయ పడతానని అన్నారు. కార్తీ తెలుగులో చాల స్పష్టంగా, అర్ధవంతంగా మాట్లాడతాడని అన్నారు.


అంతేకాదు క్లాస్ లో కూడా కార్తీ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అని..తానే లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అని.. తను జస్ట్ బార్డర్ మార్క్స్ తో పాస్ అవుతారని అన్నారు. ఇక గతంలో కార్తీ ఓ సారి బిగ్ బాస్ షోకి వచ్చినప్పుడు నాగార్జున సినిమాలోని ఓ తెలుగు పాట మొత్తం పాడారని నాగ్ అన్నారు. అవును.. కార్తీ మీ సాంగ్స్ చిరంజీవి సర్ సాంగ్స్ ఇలా అన్ని తెలుగు సాంగ్స్ పాడతాడని సూర్య చెప్పారు. అలా నాగ్, సూర్యల వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.