Alia Bhatt : తన కూతుర్ని యాక్టర్ చెయ్యదు అంట.. రాహా భవిష్యత్తు గురించి అలియా వ్యాఖ్యలు..
తన కూతురు రాహా గురించి అప్పుడప్పుడు సోషల్ మీడియాలోపోస్ట్ చేస్తూ ఉంటుంది అలియా. (Alia Bhatt)
Alia Bhatt
Alia Bhatt : బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్ – రణబీర్ కపూర్ జంటకు రాహా అనే కూతురు ఉన్న సంగతి తెలిసిందే. తనకు ఇప్పుడు మూడేళ్లు. అప్పుడపుడు రాహా ని బయటకు తీసుకొస్తూ ఉంటుంది అలియా. మీడియా ముందుకు కూడా పలుమార్లు తీసుకొచ్చింది అలియా. దీంతో రాహా క్యూట్ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.
ఇక తన కూతురు రాహా గురించి అప్పుడప్పుడు సోషల్ మీడియాలోపోస్ట్ చేస్తూ ఉంటుంది అలియా. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కూతురు భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Also Read : Rakul Preet Singh : నేషనల్ లెవల్ ప్లేయర్.. కానీ ఆ గేమ్ ని వదిలేసింది.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..
అలియాభట్ మాట్లాడుతూ.. తను యాక్టర్ కంటే కూడా క్రీడాకారిణి కావాలని కోరుకుంటున్నాను. రాహాలో క్రీడాకారులకు చెందిన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆమెలో పోటీ తత్త్వం, క్రీడా నైపుణ్యాలు ఉన్నాయి. ఆమెకు మూడేళ్లే కానీ తేనెటీగల ఇల్లంతా గంతులు వేస్తూ తిరుగుతుంది. భవిష్యత్తులో స్పోర్ట్స్ లోకి వెళ్ళొచ్చేమో అని తెలిపింది.
దీంతో అలియా భట్ తన కూతురు రాహాని స్పోర్ట్స్ లోకి పంపించాలనుకున్నట్టు తెలుస్తుంది. మరి రాహా భవిష్యత్తులో ఏ గేమ్ లోకి వెళ్తుందో చూడాలి.
