Alia Bhatt: బ్లాక్ సారీ, వెరైటీ బ్లౌజ్ లో కట్టిపడేసిన ఆలియా భట్.. తెగ వైరల్ అవుతున్న ఫోటోలు..
'ఆలియా భట్' సబ్యసాచి 25వ వార్షికోత్సవ ఈవెంట్ లో 'స్లీవ్ లెస్' బ్లౌజ్ లో దిగిన ఫోటోలను షేర్ చెయ్యగా అవి కాస్త వైరల్ గా మారాయి.

సబ్యసాచి 25వ వార్షికోత్సవ వేడుకల్లో బోల్డ్ లుక్ లో జిగేల్ అనిపించిన ఆలియా భట్

ఫేమస్ సెలబ్రిటీ డిజైనర్ 'సబ్యసాచి' డిజైన్స్‌ను 'ఆలియా భట్' ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది.

అందుకే డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా లో ఫోటోలు షేర్ చేసింది.

ఎన్నో 'రెడ్ కార్పెట్' ఈవెంట్ ల నుండి నా 'మ్యారేజ్' కి కూడా మీరు డిజైన్ చేసినవి ధరించడం నాకు ఎంతో గర్వాంగా ఉందంటూ.. సబ్యసాచిని తెగ పొగిడేసింది ఆలియా.

అంతేగాక మీరు డిజైన్ చేసిన దాంట్లో మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయని అలియా అన్నారు

'స్లీవ్ లెస్' బ్లౌజ్ లో దిగిన ఫోటోలను షేర్ చెయ్యగా తన ఫాలోవర్స్ పెళ్లి తర్వాత మరింత అందంగా తయారయ్యావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రాజమౌళి “ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అలియా.. త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఉందని ఓపెన్ గానే స్టేట్ మెంట్ ఇచ్చింది.

సబ్యసాచి 25వ వార్షికోత్సవ ఈవెంట్ లో పాల్గొన్న ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి.

సబ్యసాచి 25వ వార్షికోత్సవ ఈవెంట్ లో ఆలియా భట్ తో పాటు దీపికా పదుకొణె, సోనమ్ కపూర్, అనన్య పాండే, అదితి రావు హైదరీ, ఇతర హీరోయిన్స్ పాల్గొన్నారు.