Adipurush Controversy : ఇది మ‌న రామాయ‌ణం కాదు.. వెంట‌నే బ్యాన్ చేయండి.. ప్ర‌ధాని మోదీకి లేఖ‌

ప్ర‌భాస్(Prabhas) రాముడిగా, కృతి స‌న‌న్ (Kriti Sanon) సీత‌గా న‌టించిన చిత్రం ఆదిపురుష్‌(Adipurush). ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావ‌ణాసురుడిగా క‌నిపించారు

Adipurush Controversy : ఇది మ‌న రామాయ‌ణం కాదు.. వెంట‌నే బ్యాన్ చేయండి.. ప్ర‌ధాని మోదీకి లేఖ‌

Ban Adipurush

Adipurush : ప్ర‌భాస్(Prabhas) రాముడిగా, కృతి స‌న‌న్ (Kriti Sanon) సీత‌గా న‌టించిన చిత్రం ఆదిపురుష్‌(Adipurush). ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావ‌ణాసురుడిగా క‌నిపించారు. జూన్ 16న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విడుద‌లైన‌ప్ప‌టి నుంచి ఈ సినిమాను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. రోజు రోజుకు ఈ చిత్రాన్ని నిషేదించాల‌నే డిమాండ్‌లు పెరుగుతున్నాయి. తాజాగా ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్(All India Cine Workers Association ) ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(Narendra Modi)కి లేఖ రాసింది. ఆదిపురుష్ చిత్రంలోని స్ర్కీన్‌ప్లే, డైలాగులు, రాముడు, హ‌నుమంతుడు గౌర‌వాన్ని దెబ్బ‌తీసేలా ఉన్నాయ‌ని వెంట‌నే ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా బ్యాన్ చేయాల‌ని అందులో కోరింది. ఓటీటీలో కూడా ఈ చిత్రం ప్ర‌ద‌ర్శితం కాకుండా చూడాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

Adipurush : ఆదిపురుష్ సినిమాలో ఆక్వామ్యాన్ అంటూ నెటిజెన్స్ ట్రోల్స్.. మీరు గమనించారా..?

‘ఆదిపురుష్ సినిమా హిందువుల మ‌నోభావాల‌ను, స‌నాత‌న ధ‌ర్మాన్ని దెబ్బ‌తీసేలా ఉంది. అంద‌రికి శ్రీరాముడు భ‌గ‌వంతుడు. ఈ చిత్రంలోని డైలాగులు దేశంలో ఉన్న‌, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భార‌తీయుడిని బాధ‌పెట్టేలా ఉన్నాయి. శ్రీరాముడిపై, రామాయ‌ణంపై ప్ర‌జ‌ల‌కు ఉన్న న‌మ్మ‌కాన్ని ఈ చిత్రం పూర్తిగా విధ్వంసం చేసింది. వీడియో గేమ్‌ల‌లో పాత్ర‌ల్లాగా దేవుళ్ల‌ను చిత్రీక‌రించారు. భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో ఇంత‌టి అవ‌మాన‌క‌ర‌మైన సినిమా భాగం కాకూడ‌దు. ఈ సినిమాను వెంట‌నే నిలిపివేయాలి. భ‌విష్య‌త్తులో ఓటీటీలో కూడా దీనిని ప్ర‌ద‌ర్శించ‌కుండా చూడాలి. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ ముంతాసిర్ శుక్లా, నిర్మాతలపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాలి.’ అని ప్ర‌ధాన మంత్రికి రాసిన లేఖ‌లో ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ కోరింది.

Adipurush Controversy : ఆదిపురుష్ చిత్రం ఆపేయాలంటూ ర‌చ్చ‌.. ప్రేక్ష‌కుల‌ను బ‌య‌ట‌కు వెళ్లిపోమ‌ని..

నేపాల్‌లోని ప‌లు ప్రాంతాల్లో బ్యాన్‌

ఇదిలా ఉంటే.. ఆదిపురుష్ చిత్రాన్ని ఇప్ప‌టికే నేపాల్‌లోని ప‌లు ప్రాంతాల్లో బ్యాన్ చేశాడు. సీతాదేవి నేపాల్‌లో జ‌న్మించింద‌ని, అయితే ఈ సినిమాలో మాత్రం భార‌త్‌లో జ‌న్మించింద‌నే డైలాగ్ ఉంద‌ని, వెంట‌నే దానిని మార్చాల‌ని డిమాండ్ చేశారు. చిత్ర బృందానికి మూడు రోజుల సమ‌యం ఇచ్చారు. అయితే.. చిత్ర బృందం నుంచి ఎటువంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో ఖాట్మండు, ఫోఖారాలో నిషేదం విధించారు. ఆ డైలాగ్‌ను మార్చేంత వ‌ర‌కు ఆదిపురుష్ సినిమాతో పాటు మ‌రే భార‌తీయ సినిమాను ప్ర‌ద‌ర్శించ‌మంటూ తెలిపింది. తాజాగా ఆదిపురుష్ చిత్ర బృందం ఖాట్మాండు మేయ‌ర్‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతూ లేఖ రాసింది.

Adipurush : అప్డేట్ అవ్వండిరా అంటారు.. అప్డేట్ అయినా ట్రోల్ చేస్తారు.. ఆదిపురుష్ డిస్ట్రిబ్యూటర్!