Vijay-Naresh : ఉగ్రం టీజర్ లాంచ్‌లో.. అదే డైరెక్టర్‌తో మూడో సినిమా కూడా ప్రకటించిన అల్లరి నరేష్

ఉగ్రం టీజర్ లాంచ్ ఈవెంట్ లో నరేష్ మాట్లాడుతూ.. డైరెక్టర్ విజయ్ నన్ను నమ్మాడు. ఏదో అలా కామెడీ సినిమాలు చేసుకుంటూ వెళ్తూ, ఫ్లాప్స్ లో ఉన్న నాకు నాంది సినిమాతో నాలో సరికొత్త నటుడ్ని చూపించాడు. ఉగ్రం సినిమాలో ఒక డైలాగ్ ఉంది. నాది కాని రోజున కూడా నేను నిలబడతాను అని. నాది కాని రోజున కూడా విజయ్ నా కోసం నిలబడి...............

Vijay-Naresh : ఉగ్రం టీజర్ లాంచ్‌లో.. అదే డైరెక్టర్‌తో మూడో సినిమా కూడా ప్రకటించిన అల్లరి నరేష్

Allari Naresh announced third movie under nandi director vijay kanakamedala in ugram teaser launch event

Updated On : June 3, 2023 / 4:21 PM IST

Vijay-Naresh :  ఒకప్పుడు కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ మధ్య మధ్యలో ఎమోషనల్ సినిమాలతో కూడా మెప్పించాడు. ఇటీవల విజయ్ కనకమేడల దర్శకత్వంలో నాంది సినిమాతో వచ్చి తన పంథాని మార్చుకున్నాడు. విజయ్ దర్శకత్వంలో నరేష్ సరికొత్తగా సీరియస్, ఎమోషనల్ రోల్ చేసి అందర్నీ మెప్పించాడు. ఈ సినిమా అప్పుడే ఇకపై ఇలాంటి సినిమాలే చేస్తాను, కొన్నాళ్ళు కామెడీ సినిమాలకు దూరంగా ఉంటాను అని ప్రకటించాడు నరేష్.

నాంది సినిమా తర్వాత కూడా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే ఎమోషనల్ కంటెంట్ తో వచ్చి మరోసారి అందర్నీ మెప్పించాడు. ఇప్పుడు త్వరలో ఉగ్రం సినిమాతో రాబోతున్నాడు. మరోసారి నాంది డైరెక్టర్ విజయ్ దర్శకత్వంలో నరేష్ ఈ ఉగ్రం సినిమా చేస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా బుధవారం నాడు ఉగ్రం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నాగచైతన్య గెస్ట్ గా వచ్చాడు.

RRR Re Release in US: అమెరికాలో RRR గ్రాండ్ రీ రిలీజ్.. ఏకంగా 200 థియేటర్స్ లో.. ఆస్కార్ టార్గెట్ గా?

ఉగ్రం టీజర్ లాంచ్ ఈవెంట్ లో నరేష్ మాట్లాడుతూ.. డైరెక్టర్ విజయ్ నన్ను నమ్మాడు. ఏదో అలా కామెడీ సినిమాలు చేసుకుంటూ వెళ్తూ, ఫ్లాప్స్ లో ఉన్న నాకు నాంది సినిమాతో నాలో సరికొత్త నటుడ్ని చూపించాడు. ఉగ్రం సినిమాలో ఒక డైలాగ్ ఉంది. నాది కాని రోజున కూడా నేను నిలబడతాను అని. నాది కాని రోజున కూడా విజయ్ నా కోసం నిలబడి నాకు నాంది సినిమా ఇచ్చాడు. అప్పుడే ఫిక్స్ అయ్యాను విజయ్ కోసం నేను నిలబడతాను. ఇది మా కాంబినేషన్ లో రెండో సినిమా. మూడో సినిమా కూడా చేస్తాము. నేను వేరే సినిమా, విజయ్ వేరే సినిమా చేసొచ్చాక మళ్ళీ మా కాంబినేషన్ లో సినిమా ఉంటుంది. ఇలా ఎన్ని సినిమాలు కుదిరితే అన్ని సినిమాలు విజయ్ దర్శకత్వంలో చేస్తాను అని ప్రకటించాడు నరేష్. దీంతో విజయ్-నరేష్ కాంబోలో మూడో సినిమా కూడా అధికారికంగా కన్ఫామ్ అయినట్టే.