RRR Re Release in US: అమెరికాలో RRR గ్రాండ్ రీ రిలీజ్.. ఏకంగా 200 థియేటర్స్ లో.. ఆస్కార్ టార్గెట్ గా?

ఇప్పటివరకు అమెరికాలో అనేక థియేటర్స్ లో సినిమా రిలీజయి, స్పెషల్ షోలు వేసుకున్న RRR సినిమా ఇప్పుడు త్వరలో అమెరికా మొత్తం మళ్ళీ రీ రిలీజ్ కాబోతుంది. ఆస్కార్ కి మరో రెండు వారాలు టైం మాత్రమే ఉండటంతో రాజమౌళి ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అమెరికాలో RRR సినిమాని.............

RRR Re Release in US: అమెరికాలో RRR గ్రాండ్ రీ రిలీజ్.. ఏకంగా 200 థియేటర్స్ లో.. ఆస్కార్ టార్గెట్ గా?

RRR movie Re Release in America on March 3rd in 200 theaters

Updated On : February 23, 2023 / 10:23 AM IST

RRR Re Release in US: రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని ప్రేక్షకులు, ప్రముఖులు అభినందిస్తూనే ఉన్నారు. ఇక రాజమౌళి దర్శకత్వానికి అంతా ఫిదా అయ్యారు. ఇప్పటికే RRR సినిమా అంతర్జాతీయంగా పలు అవార్డులు అందుకుంది. నాటు నాటు సాంగ్ తో గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా అందుకొని చరిత్ర సృష్టించింది RRR సినిమా. ఇక అదే నాటు నాటు సాంగ్ ఆస్కార్ లిస్ట్ లో నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడు అంతా ఆ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుంటున్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ని గత కొన్ని నెలలుగా రాజమౌళి దగ్గరుండి మరీ హాలీవుడ్ లో గ్రాండ్ గా చేస్తూనే ఉన్నారు. అవార్డులు టార్గెట్ గా పెట్టుకొని ప్రమోషన్స్ వీర లెవల్లో చేశారు. సంవత్సరం నుంచి RRR హవా సాగుతూనే ఉంది. ఇక సినీ పరిశ్రమలో అత్యున్నత పురస్కారం ఆస్కార్ వరకు వెళ్ళింది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ లిస్ట్ లో నిలవడంతో ఎలాగైనా ఆస్కార్ కొట్టాలని గట్టిగానే ట్రై చేస్తున్నారు చిత్రయూనిట్.

దీంట్లో భాగంగానే ఇప్పటివరకు అమెరికాలో అనేక థియేటర్స్ లో సినిమా రిలీజయి, స్పెషల్ షోలు వేసుకున్న RRR సినిమా ఇప్పుడు త్వరలో అమెరికా మొత్తం మళ్ళీ రీ రిలీజ్ కాబోతుంది. ఆస్కార్ కి మరో రెండు వారాలు టైం మాత్రమే ఉండటంతో రాజమౌళి ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అమెరికాలో RRR సినిమాని మార్చ్ 3న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ రీ రిలీజ్ ఏకంగా 200 థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. దీంతో అక్కడి RRR అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Naveen Chandra : తండ్రైన నటుడు.. బాబుకి జన్మనిచ్చిన నవీన్ చంద్ర భార్య..

ఇప్పటికే చరణ్ అమెరికాలో ఉన్నాడు. కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి ఇటీవలే మళ్ళీ అమెరికాకు వెళ్లారు. త్వరలోనే ఎన్టీఆర్ కూడా వెళ్లనున్నారు. ఆస్కార్ వేడుకలకు చిత్రయూనిట్ మొత్తం పాల్గొననున్నట్టు సమాచారం. దీంతో రాజమౌళి అక్కడే ఉండి ఇదే చివరి అవకాశం కావడంతో సినిమాని మరింత ప్రమోట్ చేస్తున్నాడు.