Anupama Parameswaran : హీరోయిన్ తో కలిసి స్టెప్పులేసిన అల్లు అరవింద్, సుకుమార్.. వీడియో వైరల్..

మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది 18 పేజెస్ సినిమా. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ముందు నుంచి కూడా సినిమా విజయం పై ధీమాగా ఉన్నారు చిత్ర యూనిట్. సినిమాకి ఫుల్ పాజిటివ్ రివ్యూస్ రావడంతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగిపోయారు............

Anupama Parameswaran : హీరోయిన్ తో కలిసి స్టెప్పులేసిన అల్లు అరవింద్, సుకుమార్.. వీడియో వైరల్..

Allu Aravind and Sukumar Dance with Anupama Parameswaran in 18 Pages Movie Success Celebrations

Updated On : December 25, 2022 / 6:00 PM IST

Anupama Parameswaran :  నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి జంటగా కొన్ని నెలల క్రితం కార్తికేయ 2 సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టి ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సారి ఇదే జంట ’18 పేజెస్’ సినిమాతో వచ్చారు. 18 పేజెస్ సినిమాకి సుకుమార్ కథ అందించగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో GA2 బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ కలిపి సినిమాని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకి థియేటర్స్ లోకి వచ్చింది.

మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది 18 పేజెస్ సినిమా. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ముందు నుంచి కూడా సినిమా విజయం పై ధీమాగా ఉన్నారు చిత్ర యూనిట్. సినిమాకి ఫుల్ పాజిటివ్ రివ్యూస్ రావడంతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగిపోయారు.

Mega Fans Meet : మీరేమి భయపడక్కర్లేదు.. మెగా ఫ్యాన్స్ మీట్ లో డైరెక్టర్ బాబీ, మెగా బ్రదర్ నాగబాబు..

తాజాగా ఓ పబ్లిక్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఈ సినిమా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్ కలిసి 18 పేజెస్ సినిమాలోని టైం ఇవ్వు పిల్ల పాటకి స్టెప్పులేశారు. ఈ వీడియోని నిఖిల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. హీరోయిన్ తో అల్లు అరవింద్, సుకుమార్ డ్యాన్స్ వేయడంతో ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు.