Allu Aravind Sensational Comments on Tollywood regarding Pawan Kalyan and Theaters Issue
Allu Aravind : గత కొన్ని రోజులుగా నిర్మాతలు – ఎగ్జిబిటర్ల మధ్య థియేటర్స్ ఇష్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో థియేటర్స్ కూడా బంద్ చేస్తామని అన్నారు. ఈ ఇష్యూ పెద్దది అవడం, కొంతమంది కావాలని హరిహర వీరమల్లు రిలీజ్ సమయంలో ఈ బంద్ ప్రస్తావన తేవడం.. లాంటివి చూసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమపై, థియేటర్స్ ఇష్యూపై సీరియస్ అవుతూ సినిమాటోగ్రఫీ శాఖ తరపున ఓ లెటర్ రిలీజ్ చేసారు.
పవన్ కళ్యాణ్ టాలీవుడ్ పై సీరియస్ అవడం, థియేటర్లపై విచారణకు ఆదేశించడంతో టాలీవుడ్ నిర్మాతలు ఒక్కొక్కరు ఒకో విధంగా స్పందిస్తున్నాడు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నేడు ప్రెస్ మీట్ పెట్టి మరీ స్పందించారు. పవన్ కళ్యాణ్ చేసింది కరెక్ట్ అని, ఆయన సినిమా వస్తుంటే ఇలా చేస్తారా? ఆయన్ని బెదిరిస్తున్నారా? సినిమాటోగ్రఫీ శాఖ రిలీజ్ చేసిన అంశాలు అన్ని నిజమే అని అన్నారు.
ఈ క్రమంలో.. నిన్న ఎవరో మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం. ప్రభుత్వానికి ఏం సంబంధం. ప్రభుత్వానికి సంబంధం లేదు అని అర్ధం వచ్చేలా మాట్లాడారు. ప్రభుత్వానికి సంవందం లేకపోతే రెండేళ్ల క్రితం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ్నుంచి కదిలి వెళ్లి గత చీఫ్ మినిస్టర్ ని ఎందుకు కలిశారు? ఏ వ్యాపారం అయినా సాఫీగా సాగాలంటే ప్రభుత్వం సహకారం ఉండాలి. అంతేకాని ఎలా అంటారు ప్రభుత్వానికి సంబంధం లేదని. ప్రభుత్వం సహకారం కావాలి. ప్రభుత్వం సంబంధం ఉంటుంది. లేకపోతే గత చీఫ్ మినిస్టర్ ని ఎందుకు కలిశారు? మనకు కష్టం వచ్చిందనే కదా కలిసారు. కష్టం వస్తే తప్ప ప్రభుత్వం గుర్తురాదా. సినిమాటోగ్రఫీ మినిస్టర్ నుంచి వచ్చిన లెటర్ నేను చదివాను. అందులో ఉన్నది నిజం అని అల్లు అరవింద్ అన్నారు.
గతంలో టికెట్ రేట్ల గురించి చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు.. లాంటి స్టార్ హీరోలు, అగ్ర నిర్మాతలు అంతా కలిసి మాజీ సీఎం జగన్ దగ్గరికి వెళ్లి కలిశారు. మరి ఇంత జరిగాక ఇప్పుడైనా టాలీవుడ్ వెళ్లి సీఎం చంద్రబాబుని కలుస్తారా చూడాలి. అలాగే అల్లు అరవింద్ కామెంట్స్ పై టాలీవుడ్ నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
https://www.youtube.com/watch?v=F2gzEV5j5VQ