Allu Arjun: ఇద్దరు స్టార్స్ రిజెక్ట్ చేసిన కథతో లోకేష్ మూవీ.. అల్లు అర్జున్ రిస్క్ చేస్తున్నాడా?
అల్లు అర్జున్(Allu Arjun)- లోకేష్ కనగరాజ్ కాంబోలో రాబోతున్న సినిమా కథ గురించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
allu arjun and lokesh kanagaraj movie latest update
- లోకేష్ తో అల్లు అర్జున్ కొత్త మూవీ
- ఈ కథను ఇద్దరు స్టార్స్ రిజెక్ట్ చేశారట
- టెన్షన్ పడుతున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్
Allu Arjun: పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. అందుకే. తన తరువాతి సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నాడు. ఈ నేపధ్యంలోనే తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో చేస్తున్నాడు అల్లు అర్జున్. అందుకోసం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో జత కట్టాడు. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించి విడుదలైన వీడియోకి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది.
సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఇండియన్ స్క్రీన్ పై కనీవినీ ఎరుగని విజువల్స్ తో వస్తున్న ఈ సినిమా 2027లో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే, అట్లీ తరువాత అల్లు అర్జున్(Allu Arjun) ఎవరితో సినిమా చేస్తాడు అనే చర్చ చాలా కాలంగా ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంది. చాలా మంది దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. కానీ, ఫైనల్ గా అల్లు అర్జున్ మాత్రం మరోసారి తమిళ దర్శకుడికే సై అన్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు లోకేష్ కనగరాజ్. ఖైది సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ దర్శకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిపోయాడు.
Yellamma Glimpse: దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ‘ఎల్లమ్మ’.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్
ఇక అప్పటినుంచి ఈ లోకేష్ తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫైనల్ గా ఈ దర్శకుడు తన నెక్స్ట్ సినిమా కోసం అల్లు అర్జున్ ను ఒప్పించాడు. సంక్రాంతి కానుకగా ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన చేస్తూ వీడియో కూడా విడుదల చేశారు. టాలీవుడ్ స్టార్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్టుని నిర్మించనుంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నాడు. దీంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
అయితే, తాజాగా అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తోంది. అదేంటంటే, అల్లు అర్జున్ కి చెప్పిన ఒప్పించిన కథను లోకేష్ ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలకి చెప్పాడట. ఆ స్టార్స్ మీరెవరో కాదు తమిళ స్టార్ సూర్య, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్. ఈ ఇద్దరు కొన్ని కారణాల వల్ల ఏ కథను రిజెక్ట్ చేశారట. ఇప్పుడు ఆ ఇద్దరు స్టార్స్ రిజెక్ట్ చేసిన కథకు ఒకే చెప్పాడు అల్లు అర్జున్. దీంతో ఆయన ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. రిజెక్ట్ చేసిన కథను ఓకే చేయడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ న్యూస్ పై మేకర్స్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.
