బిజీ బిజీగా స్టైలీష్ స్టార్

పదకొండు నెలలు కావస్తోంది అల్లు అర్జున్‌ స్క్రీన్‌ మీద కనిపించి. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేయడానికి కాస్త సమయం తీసుకున్నారు.

  • Published By: veegamteam ,Published On : April 9, 2019 / 06:25 AM IST
బిజీ బిజీగా స్టైలీష్ స్టార్

Updated On : April 9, 2019 / 6:25 AM IST

పదకొండు నెలలు కావస్తోంది అల్లు అర్జున్‌ స్క్రీన్‌ మీద కనిపించి. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేయడానికి కాస్త సమయం తీసుకున్నారు.

పదకొండు నెలలు కావస్తోంది అల్లు అర్జున్‌ స్క్రీన్‌ మీద కనిపించి. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేయడానికి కాస్త సమయం తీసుకున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు అనౌన్స్‌ చేశారు. కానీ ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌ మీదకు ఎప్పుడు వెళ్తుంది? తర్వాత చేయబోయే కొత్త ప్రాజెక్ట్‌ డీటైల్స్‌ ఏంటి? అని అయోమయంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
Read Also : సర్వేలు అనుకూలం: ఓటమి భయంతో వైసీపీ బెంబేలు

టాలివుడ్ లో నాలుగు పెద్ద బ్యానర్స్ లో అల్లు అర్జున్ వరుస సినిమాలు చేయబోతున్నాడు. అయితే సోమవారం (ఏప్రిల్ 8, 2019)న అల్లు అర్జున్‌ బర్త్ డే సందర్భంగా త్రివిక్రమ్, సుకుమార్, వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో చేయబోయే మూడు సినిమాలకి సంబంధించిన పోస్టర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. వేణు శ్రీరామ్, బన్నీ సినిమాకి ‘ఐకాన్’ కనబడుటలేదు’ అనే వెరైటీ టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయబోయే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఏప్రిల్‌ 24 నుంచి మొదలు కానుందని తెలిపారు. ఇందులో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తారు. గీతా ఆర్ట్స్, హారికా హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్లు నిర్మిస్తాయి. థమన్ మ్యూజిక్ అందించబోతున్నాడు.
Read Also : జగన్ వైసీపీని బీజేపీలో కలిపేస్తారు: నారా రోహిత్