‘సొంత డాడీని.. నన్ను బే అంటావా బే’.. ‘అవును బే’.. తండ్రీ కూతుళ్ల అల్లరి మామూలుగా లేదుగా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అర్హల అల్లరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

  • Published By: sekhar ,Published On : March 2, 2020 / 06:35 AM IST
‘సొంత డాడీని.. నన్ను బే అంటావా బే’.. ‘అవును బే’.. తండ్రీ కూతుళ్ల అల్లరి మామూలుగా లేదుగా!

Updated On : March 2, 2020 / 6:35 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అర్హల అల్లరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

అల్లు అర్జున్ – అర్హల అల్లరి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల ముద్దుల తనయ అల్లు అర్హ అల్లరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ ఫ్రీ టైమ్ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాడనే సంగతి తెలిసిందే. ఇంట్లో పిల్లలతో ఉంటే అసలు టైమే తెలియదు అంటుంటాడు బన్నీ. ఇంతకుముందు ‘డాడీ చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోమ్మా’.. అని బన్నీ అడిగితే ‘నేను చేసుకోను’.. అంటూ అల్లరి చేసి ఆకట్టుకున్న చిన్నారి అర్హ, తర్వాత ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘రామూలో రాములా’ పాటకి డాడీ దోశె స్టెప్ వేసాడని అలరించింది.

తాజాగా బన్నీని బే అంటూ ఆటపట్టించింది. ‘ఫేవరెట్ కలర్ ఏంటి బే’ అని బన్నీ అడగ్గా.. ‘పింక్ బే’ అంటూ అర్హ బదులిచ్చింది. దానికి బన్నీ ‘ఆ.. నన్ను బే అంటావా బే’.. అనగా అర్హ ‘అవును బే’ అనడం.. ‘టు టైమ్స్, త్రీ టైమ్స్ బే అంటావా.. సొంత డాడీని.. ఓన్ ఫాదర్‌ని.. కన్న తండ్రిని నన్ను బే అంటావా బే ఇన్నిసార్లు’..(మనసా.. నా మాట అలుసా.. నేనెవరో తెలుసా..)

అంటే అర్హ ‘అవును బే’.. అనడం.. ‘నీకసలు భయం ఉందా’ అంటే ‘లేదు’ అనడం.. బన్నీ కూతురిని ప్రేమగా హత్తుకోవడం.. భలే క్యూట్‌గా ఉంది వీడియో.. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించే కొత్త సినిమా షూటింగులో కొద్దిరోజుల్లో జాయిన్ కానున్నాడు అల్లు అర్జున్.. తండ్రీ కూతుళ్ల అల్లరి వీడియో మీరు కూడా ఓ లుక్కెయ్యండి మరి..

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

She’s my Bae ( Bey ) #fatherdaughterlove #justforfunn #alluarha

A post shared by Allu Arjun (@alluarjunonline) on