Allu Arjun: నువ్వు లేక నేను లేను.. సుకుమార్‌ను తలచుకొని ఏడ్చేసిన బన్నీ!
తనను స్టార్ ను చేసిన దర్శకుడు సుకుమార్ అని.. అప్పుడు స్టైలిష్ స్టార్ ను చేసిన నువ్వే.. ఇప్పుడు ఇలా ఐకాన్ స్టార్ ను చేసి యావత్ దేశం నన్ను చూసేలా చేసిన సుకుమార్ కు రుణపడి ఉంటానని..
Allu Arjun: తనను స్టార్ ను చేసిన దర్శకుడు సుకుమార్ అని.. అప్పుడు స్టైలిష్ స్టార్ ను చేసిన నువ్వే.. ఇప్పుడు ఇలా ఐకాన్ స్టార్ ను చేసి యావత్ దేశం నన్ను చూసేలా చేసిన సుకుమార్ కు రుణపడి ఉంటానని అల్లు అర్జున్ భావోద్వేగమయ్యాడు. పుష్ప సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడిన బన్నీ.. దర్శకుడు సుకుమార్ గురించి చెప్తూ.. నువ్వు లేకపోతే నేను లేనని వెల్లడించాడు. తన జీవితంలో సుకుమార్ కంట్రిబ్యూషన్ గురించి చెప్పేందుకు మాటలు సరిపోవని చెప్పాడు.
Pan India Films: మారిన రూల్.. బాలీవుడ్‌కి బ్యాండ్ బజాయిస్తున్న టాలీవుడ్!
పరుగు సినిమా సమయంలో ఓ కారు కొనుక్కున్నానన్న బన్నీ దాని ఖరీదు రూ.85 లక్షలని.. ఆ కార్ స్టీరింగ్ పట్టుకున్న సమయంలో తాను ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరని తలచుకుంటే ముందుగా గుర్తొచ్చిన వ్యక్తి సుకుమార్ మాత్రమేనని కంటతడి పెట్టుకున్నాడు. బన్నీ భావోద్వేగం ఈవెంట్ లో ఉన్న అందరినీ ఎమోషన్ కు గురిచేయగా.. సుకుమార్ కంట తడి పెట్టుకున్నాడు.
Salman Khan: ఎప్పుడూ లేనంతగా సినిమాల్ని లైనప్ చేస్తున్న సల్మాన్!
ప్రతిసారి పబ్లిక్ వేడుకలలో ఇలా ఎమోషనల్ కాకూడదని అనుకుంటానని.. కానీ తెలియకుండానే ఈరోజు ఎమోషన్ అయిపోయానని బన్నీ చెప్పాడు. తన కెరీర్ లో సుకుమార్ ఎంత ముఖ్యమైన వ్యక్తి అనేది మాటలలో చెప్పేది కాదన్న బన్నీ.. తనను స్టార్ ను చేసింది నువ్వే.. స్టైలిష్ స్టార్ నుండి ఇప్పుడు ఇలా ఐకాన్ స్టార్ చేసి దేశం నన్ను చూసేలా చేసింది నువ్వేనని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు.