Allu Arjun : నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు సాధించిన అల్లుడు.. స్పెషల్ పార్టీ ఇచ్చిన మామ..

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను బన్నీకి నేషనల్ బెస్ట్ యాక్టర్(National Best Actor) అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.

Allu Arjun : నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు సాధించిన అల్లుడు.. స్పెషల్ పార్టీ ఇచ్చిన మామ..

Allu Arjun Father in Law Chandrasekhar Reddy arranged Special Party for Bunny Achieved National Award

Updated On : October 19, 2023 / 8:28 PM IST

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప(Pushpa) సినిమాతో నేషనల్ స్టార్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు, సినిమా పాటలకు వరల్డ్ వైడ్ రీచ్ వచ్చింది. సినిమాపై, అందులో బన్నీ నటనకు అంతే రేంజ్ లో ప్రశంశలు వచ్చాయి. ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను బన్నీకి నేషనల్ బెస్ట్ యాక్టర్(National Best Actor) అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుని బన్నీ ఇటీవల అక్టోబర్ 17న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నాడు.

Also Read : Bhagavanth Kesari : బాలయ్య అభిమానుల రచ్చ.. కటౌట్‌కి అభిషేకం పాలతో కాదు.. ఆల్కహాల్‌తో.. అది కూడా ఏ బ్రాండ్ తెలుసా?

బన్నీ నేషనల్ అవార్డుని తీసుకొని నిన్న ఇంటికి రాగా అభిమానులు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. ఇక నేడు అల్లు అర్జున్ మామ, స్నేహ రెడ్డి వాళ్ళ నాన్న చంద్రశేఖర్ రెడ్డి(Chandrasekhar Reddy) తన అల్లుడికి నేషనల్ అవార్డు వచ్చినందుకు స్పెషల్ పార్టీ అరేంజ్ చేశారు. కేవలం కుటుంబ సభ్యులు, చిత్రయూనిట్ ,కొంతమంది సన్నిహితులకు మాత్రమే ఈ పార్టీని అరేంజ్ చేశారు. దీంతో ఈ పార్టీలోని ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ఈ పార్టీలో అల్లు అరవింద్ తన ముగ్గురు కొడుకులతో దిగిన ఫొటో మరింత వైరల్ గా మారింది.

Allu Arjun Father in Law Chandrasekhar Reddy arranged Special Party for Bunny Achieved National Award