Pushpa 2 : బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప-2’ ఊచకోత.. 11 రోజుల వసూళ్లు ఎంతంటే?
పుష్ప 2 విడుదలై 11 రోజులు పూర్తి చేసుకుంది.

Allu Arjun Pushpa 2 movie 11 days collections
Pushpa 2 : బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప 2. ఇక ఈ సినిమా విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు వసూళ్ల విషయంలో మాత్రం తగ్గడం లేదు. విడుదలైన మొదటి ఆట నుండి రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వస్తున్న ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లోకి చేరింది.
Also Read : Srikakulam Sherlockholmes Trailer : వెన్నెల కిషోర్ ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’ ట్రైలర్ వచ్చేసింది..
ఇక పుష్ప 2 విడుదలై 11 రోజులు పూర్తి చేసుకుంది. తాజాగా 11 రోజులు పూర్తయ్యే సరికి ‘పుష్ప-2’ మూవీ వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ.1409 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ పుష్ప 2 మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. విడుదలైన కేవలం 11 రోజుల్లోనే ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టింది అంటే మామూలు విషయం కాదు. 1000 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టిన పలు టాలీవుడ్ తెలుగు సినిమాలు ఉన్నప్పటికీ తక్కువ సమయంలో ఇంత మొత్తంలో వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు బ్రేక్ చేసింది పుష్ప 2.
View this post on Instagram
ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కాగా పుష్ప 2 కి సీక్వెల్ గా పార్ట్ 3 కూడా ఉంది.