Pushpa 2 : సంక్రాంతి సినిమాలకు షాక్ ఇచ్చిన బన్నీ.. కొన్ని సీన్స్ యాడ్ చేసి మళ్ళీ పుష్ప 2 రిలీజ్.. ఎప్పుడో తెలుసా?

సంక్రాంతి సినిమాలకు సడెన్ గా పుష్ప 2 షాక్ ఇచ్చింది.

Allu Arjun Pushpa 2 Movie Re Release with Additional Scenes from Sankranthi

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 న రిలీజయి భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నెల రోజులు దాటగా బాహుబలి 2 రికార్డు కూడా బద్దలు కొట్టి 1831 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది పుష్ప 2 సినిమా. దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా నిలిచింది. ఇప్పటికే నెల రోజులు అవ్వగా నార్త్ లోతప్ప ఆల్మోస్ట్ అన్నిచోట్లా పుష్ప 2 థియటర్స్ లో నుంచి మెల్లిగా వెళ్ళిపోతుంది.

Also Read : NTR – Balayya : బాలయ్య ఎన్టీఆర్ గురించి అలా అన్నారా? బాలయ్య – ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ నేపథ్యంలో నిర్మాత వ్యాఖ్యలు..

మరో మూడు రోజుల్లో సంక్రాంతి సినిమాలు రానున్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ జనవరి 10న, బాలకృష్ణ డాకు మహారాజ్ జనవరి 12న, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న రానున్నాయి. ఇప్పటికే థియేటర్స్ అన్ని ఈ మూడు సినిమాలకు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం మొదలయింది. ఒక్కో సినిమాకు రెండు రోజులు గ్యాప్ ఉంది కాబట్టి దేనికి ఇబ్బంది లేకుండా థియేటర్స్ ఇచ్చి కలెక్షన్స్ తెచ్చుకోవాలని అనుకుంటున్నారు.

అయితే సంక్రాంతి సినిమాలకు సడెన్ గా పుష్ప 2 షాక్ ఇచ్చింది. పుష్ప 2 సినిమాలో మరో 20 నిముషాలు సీన్స్ జతచేసి మళ్ళీ జనవరి 11 నుంచి థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ వార్త టాలీవుడ్ లో చర్చగా మారింది. అసలు సంక్రాంతి సినిమాలు ఉన్న సమయంలో దీనికి థియేటర్స్ ఎలా ఇస్తారు అని పలువురు అంటుంటే, అసలే మూడు గంటల సినిమా నిడివి తగ్గించాల్సింది పోయి మళ్ళీ ఇంకో 20 నిముషాలు జతచేయడం అవసరమా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Oscars 2025 : భార‌త దేశం నుంచి ఆస్కార్ ఎలిజిబిలిటీ లిస్ట్‌లో ఏవేం సినిమాలు ఉన్నాయో తెలుసా?

కొంతమంది మాత్రం సంక్రాంతి సినిమాలను ఇబ్బంది పెట్టడానికే మళ్ళీ ఇలా రిలీజ్ చేస్తున్నారు అని అంటున్నారు. అయితే ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూనే ఆల్రెడీ బాహుబలి 2 రికార్డులు బ్రేక్ చేసాము కాబట్టి మిగిలిన దంగల్ రికార్డులు కూడా ఈ దెబ్బతో బ్రేక్ చేస్తాము అని అంటున్నారు. నార్త్ లో ఎలాగో హవా నడుస్తుంది, అక్కడ సంక్రాంతికి చెప్పుకోదగ్గ సిన్మాలు లేకపోవడంతో పుష్ప 2 కి మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ దంగల్ రికార్డు బ్రేక్ చేస్తాడో లేదో కానీ మళ్ళీ సీన్స్ జతచేసి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తే మాత్రం సంక్రాంతి సినిమాలకు దెబ్బ పడటం ఖాయం అని చెప్పొచ్చు.

అయితే పుష్ప 2 ఓవరాల్ గా బాహుబలి రికార్డ్ బద్దలు కొట్టినా తమిళనాడు, కేరళ.. మరికొన్ని ప్లేసెస్ లో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదని సమాచారం. ఎక్కువ కలెక్షన్స్ నార్త్ నుంచే వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ నార్త్ నే ఫోకస్ చేసి దంగల్ రికార్డ్ కి ఎరవేసారు.