Oscars 2025 : భార‌త దేశం నుంచి ఆస్కార్ ఎలిజిబిలిటీ లిస్ట్‌లో ఏవేం సినిమాలు ఉన్నాయో తెలుసా?

97వ అకాడ‌మీ అవార్డ్స్ ఈవెంట్‌కు మ‌రో రెండు నెల‌లు మాత్ర‌మే స‌మయం ఉంది

Oscars 2025 : భార‌త దేశం నుంచి ఆస్కార్ ఎలిజిబిలిటీ లిస్ట్‌లో ఏవేం సినిమాలు ఉన్నాయో తెలుసా?

Oscars 2025 Kanguva Girls Will Be Girls 5 other Indian films in contenders list

Updated On : January 7, 2025 / 5:16 PM IST

97వ అకాడ‌మీ అవార్డ్స్ ఈవెంట్‌కు మ‌రో రెండు నెల‌లు మాత్ర‌మే స‌మయం ఉంది. ఈ క్ర‌మంలో ఈ ఏడాది ఆస్కార్‌కు అర్హ‌త సాధించిన 323 చ‌ల‌న చిత్రాల జాబితాను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్ర‌క‌టించింది. ఇందులో 207 సినిమాలు ప్రతిష్టాత్మ‌క‌మైన ఉత్త‌మ కేట‌గిరీలో అర్హ‌త సాధించాయి. ఇందులో మ‌న‌దేశం నుంచి కూడా ప‌లు చిత్రాలు ఉన్నాయి.

ఇక్క‌డ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తమిళ చిత్రం కంగువ ఈ జాబితాలో ఉంది. భారీ అంచ‌నాల మ‌ధ్య గ‌తేడాది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది సూర్య న‌టించిన కంగువ చిత్రం. అయితే.. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకోలేక బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర ప‌రాజ‌యం పాలైంది. అయిన‌ప్ప‌టికి ఉత్త‌మ కేట‌గిరి విభాగంలో నిలిచింది.

Ajay Devgn : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు గుర్రాన్ని తీసుకొచ్చిన స్టార్ హీరో.. స్టేజి ఎక్కించి..

ఇక ఈ జాబితాలో పృథ్వీరాజ్ సుకుమారన్ న‌టించిన ఆడుజీవితం (గోట్ లైఫ్), స్వాతంత్ర్య వీర్ సావర్కర్, సంతోష్ ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న హిందీ చిత్రాలు కాగా.. మలయాళ చిత్రం నుంచి ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ కూడా జాబితాలో ఉంది. గర్ల్స్ విల్ బి గర్ల్స్(హిందీ-ఇంగ్లీష్‌), బెంగాలి చిత్రం పుతుల్ చిత్రం కూడా ఈ జాబితాలో చోటు ద‌క్కించుకున్నాయి.

ఈ నామినేషన్లకు రేప‌టి నుంచి ఓటింగ్ ప్రారంభం కానుంది. జ‌న‌వ‌రి 12న ముగుస్తుంది. జనవరి 17న అకాడమీ తుది నామినేషన్‌లను ప్రకటిస్తుంది.

Ram Charan : మ‌హేష్‌, ప్ర‌భాస్ ఇద్ద‌రిలో చ‌ర‌ణ్ ఎవ‌రితో మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌నుకుంటున్నాడో తెలుసా?