Pushpa 2 Ticket Price : ఏపీలో పుష్ప టికెట్ రేట్లు పెంపు.. ఎంత పెరిగాయో తెలుసా? బెనిఫిట్, అదనపు షోలకు కూడా అనుమతి..

తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది.

Pushpa 2 Ticket Price : ఏపీలో పుష్ప టికెట్ రేట్లు పెంపు.. ఎంత పెరిగాయో తెలుసా? బెనిఫిట్, అదనపు షోలకు కూడా అనుమతి..

Allu Arjun Pushpa 2 Ticket Price hike in AP Granted Here Details

Updated On : December 3, 2024 / 12:29 AM IST

Pushpa 2 Ticket Price : పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో టికెట్ రేట్లు కూడా భారీగానే పెంచుకుంటున్నారు. సినిమా మీద హైప్ కూడా దేశవ్యాప్తంగా ఉండటంతో పుష్ప 2 సినిమా టికెట్స్ కు డిమాండ్ ఏర్పడింది. దీంతో పుష్ప 2 టికెట్ రేట్లు చాలా చోట్ల భారీగానే ఉన్నాయి.

ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం పుష్ప 2 టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు గాను అల్లు అర్జున్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ కూడా చేసారు.

Also Read : Allu Arjun : స్టేజి మీదకు దూసుకొచ్చిన అభిమాని.. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి అబ్బా.. పిలిచి ఫోటో ఇచ్చిన బన్నీ..

ఏపీలో పుష్ప 2 సినిమాకు ఇచ్చిన అనుమతులు, పెరిగిన రేట్లు..

#డిసెంబర్ 4 రాత్రి 9.30 గంటల ప్రీమియర్ షోకు అనుమతి. ఈ షోకు టికెట్ ధరపై 800 వందల రూపాయల వరకు పెంచుకునేలా అనుమతి ఇచ్చారు.
#డిసెంబర్ 5 అన్ని స్క్రీన్స్ లో ఆరు షోలకు అనుమతి ఇచ్చారు. సింగిల్ స్క్రీన్స్ అప్పర్ క్లాసుకు రూ.150, లోయర్ క్లాసుకు రూ.100, మల్టీప్లెక్స్ లో రూ.200 పెంచుకునేలా అనుమతి ఇచ్చారు.
#డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 17 వరకు 5 షోలకు పర్మిషన్ ఇస్తూ సింగిల్ స్క్రీన్స్ అప్పర్ క్లాసుకు రూ.150, లోయర్ క్లాసుకు రూ.100, మల్టీప్లెక్స్ లో రూ.200 పెంచుకునేలా అనుమతి ఇచ్చారు.

Allu Arjun Pushpa 2 Ticket Price hike in AP Granted Here Details