Pushpa 2 : ‘పుష్ప-2’ నుంచి సాలీడ్ అప్‌డేట్.. క్లైమాక్స్ గూస్‌బంప్స్..
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం 'పుష్ప-2'.
Pushpa 2 climax shooting : ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప-2’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పుష్ప సినిమాకి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ మూవీ డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. తాజాగా చిత్ర బృందం ఓ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకుంది.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. భారీ వ్యయంతో నిర్మించిన ఓ సెట్‌లో పతాక సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లు తెలిపింది. హీరో బన్నీతో పాటు కీలక నటులు అంతా ఇందులో పాల్గొంటున్నారు.
క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతంగా వస్తున్నాయని, థియేటర్లలో వీటిని చూస్తే అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని చెబుతోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నాయి.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ లు నిర్మిస్తున్నారు. రష్మిక మంధాన హీరోయిన్‌గా నటిస్తుండగా.. అనసూయ, సునీల్ లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది.
ఎన్టీఆర్ బామ్మర్ది ‘ఆయ్’ ట్రైలర్ రిలీజ్.. కామెడీతో అదిరిపోయిందిగా..
Shoot Update :#Pushpa2TheRule is currently shooting a spectacular action episode for the climax??#Pushpa2TheRule Grand release worldwide on 6th DEC 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @MythriOfficial @TSeries pic.twitter.com/X5haaasHAj
— Pushpa (@PushpaMovie) August 5, 2024