Pawan Kalyan – Vikram : డిప్యూటీ సీఎం అవ్వడం మామూలు విషయం కాదు.. పవన్‌పై విక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజాగా తమిళ్ స్టార్ హీరో విక్రమ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు.

Pawan Kalyan – Vikram : డిప్యూటీ సీఎం అవ్వడం మామూలు విషయం కాదు.. పవన్‌పై విక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Tamil Star Hero Vikram Interesting Comments on Deputy CM Pawan Kalyan

Updated On : August 5, 2024 / 12:17 PM IST

Pawan Kalyan – Vikram : పవన్ కళ్యాణ్, జనసేన గెలుపు, పవన్ డిప్యూటీ సీఎం అవ్వడంపై ఇప్పటికే అనేకమంది సినీ సెలబ్రిటీలు స్పందించగా తాజాగా తమిళ్ స్టార్ హీరో విక్రమ్ స్పందించాడు. విక్రమ్ నటించిన తంగలాన్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించగా మీడియాతో ముచ్చటించారు.

Also Read : Niharika Konidela : నిహారిక కోసం రాబోతున్న మెగా బావబామ్మర్దులు.. ఆ హీరో కూడా..

ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధి పవన్ కళ్యాణ్ గురించి అడగడంతో విక్రమ్ స్పందిస్తూ.. ”పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి. ఆయన చేసింది ఒక చరిత్ర. అతని వర్క్ అంటే నాకు ఇష్టం. రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లు కష్టపడి, స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వడమంటే అది మామూలు విషయం కాదు. చాలా పెద్ద విషయం. అది చూసి నాకు కూడా ట్రై చేయాలని ఉంది కానీ చేయన”ని అన్నారు.