Niharika Konidela : నిహారిక కోసం రాబోతున్న మెగా బావబామ్మర్దులు.. ఆ హీరో కూడా..
నిహారిక నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల ఓ పక్క నటిగా సినిమాలు, సిరీస్ లు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తుంది. నిహారిక నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ రిలీజ్ చేసి 90s కిడ్స్ స్పెషల్ అన్నట్టు ప్రమోషన్స్ చేశారు.
ప్రస్తుతం కమిటీ కుర్రాళ్ళు మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు ఆగస్టు 5న హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో జరగనుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మొదట నాగ చైతన్య వస్తాడని రూమర్స్ వచ్చాయి. కానీ తాజాగా కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రాబోతున్న వారిని అధికారికంగా ప్రకటించారు.
Also Read : Rama Rajamouli : తనే నాకు మొదట ప్రపోజ్ చేసాడు.. నాకు అప్పటికే డైవర్స్ అయి ఒక బాబు ఉన్నాడు..
నిహారిక కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్, బావ సాయి ధరమ్ తేజ్ గెస్టులుగా రాబోతున్నారు. అలాగే హీరో అడివి శేష్ కూడా ఈ ఈవెంట్ కి గెస్ట్ గా రాబోతున్నారు. దీంతో మెగా బావబామ్మర్దులు ఈవెంట్ కి హాజరవుతుండటంతో ఈ ఈవెంట్ కి మెగా ఫ్యాన్స్ భారీగానే రాబోతున్నట్టు తెలుస్తుంది.
The #CKPreReleaseJaathara is going to be star-studded✨️@AdiviSesh @IAmVarunTej & @IamSaiDharamTej to grace the event Today! Don't miss ?#CommitteeKurrollu in theatres from 9th August#CKonAUG9 ?@IamNiharikaK @PinkElephant_P @SRDSTUDIOS_ @yadhuvamsi92 @eduroluraju… pic.twitter.com/7tuyQS3cvJ
— Beyond Media (@beyondmediapres) August 5, 2024