Rama Rajamouli : తనే నాకు మొదట ప్రపోజ్ చేసాడు.. నాకు అప్పటికే డైవర్స్ అయి ఒక బాబు ఉన్నాడు..
రమా రాజమౌళి తమ ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది.
Rama Rajamouli : రాజమౌళి భార్య రమాకి రాజమౌళి రెండో భర్త అని తెలిసిందే. రమాకి పెళ్లయి కార్తికేయ పుట్టిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆమె విడాకులు తీసుకుంది. ఆ తర్వాత రాజమౌళి, రమా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీని తీయగా ఇందులో రమా తమ ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది. రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా దీని గురించి మాట్లాడాడు.
రమా మాట్లాడుతూ.. రాజమౌళిని మొదటిసారి మా అక్క పెళ్లిలో చూసాను. నాకేం అతను స్పెషల్ గా అనిపించలేదు. అతను మా బావగారికి తమ్ముడు అవుతాడు. రాజమౌళినే నాకు మొదట ప్రపోజ్ చేసాడు. నేను నో చెప్పాను. నాకు అప్పటికే విడాకులు అయి ఒక కొడుకు ఉన్నాడు. అయినా రాజమౌళి వదలకుండా ఒక సంవత్సరం పాటు పట్టుదలగా ఉన్నాడు. దీంతో ఏడాది తర్వాత మేము ఇద్దరం కలిసి ప్రయాణించాలనుకున్నాం అని తెలిపింది.
Also Read : Niharika – Akhil : అఖిల్‌తో నిహారిక షార్ట్ ఫిలిం చేసిందని తెలుసా? డైరెక్టర్ ఎవరో తెలుసా?
రమా రాజమౌళి తనయుడు కార్తికేయ మాట్లాడుతూ.. ఆయన నాకు తండ్రి కాకముందే ఒక అంకుల్ గా పరిచయం. చిన్నప్పుడు నన్ను, మా ఫ్యామిలీ కజిన్స్ పిల్లల్ని బయటకి తీసుకెళ్ళేవాళ్ళు అని తెలిపాడు.