Niharika – Akhil : అఖిల్‌తో నిహారిక షార్ట్ ఫిలిం చేసిందని తెలుసా? డైరెక్టర్ ఎవరో తెలుసా?
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిహారిక నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ తో కూడా ఒక షార్ట్ ఫిలిం చేసిందని తెలిపింది.
Niharika – Akhil : మన సెలబ్రిటీలు, వాళ్ళ పిల్లలు సినిమాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశారు. చాలా తక్కువ మందివి మాత్రమే మనకు తెలుసు. మనకు తెలియని షార్ట్ ఫిలిమ్స్ మన సెలబ్రిటీలు నటించినవి చాలానే ఉన్నాయి. మెగా డాటర్ నిహారిక కొణిదెల తాను చదువుకునేటప్పుడు విశ్వక్ సేన్ తో ఒక షార్ట్ ఫిలిం చేసిన సంగతి గతంలో విశ్వక్ సేన్ చెప్పాడు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిహారిక నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ తో కూడా ఒక షార్ట్ ఫిలిం చేసిందని తెలిపింది. నిహారిక మాట్లాడుతూ.. అఖిల్ తో నేను ఒక షార్ట్ ఫిలిం చేశా. రాజమౌళి కొడుకు కార్తికేయ దాన్ని డైరెక్ట్ చేసాడు. ఆ షార్ట్ ఫిలిం సూపర్ కాదు కానీ పర్వాలేదు. రాజమౌళి ఆ సినిమాని చూసి ఇది రిలీజ్ చేయకపోతే బాగుండు అన్నారట. విశ్వక్ తో షార్ట్ ఫిలిం చేద్దామనుకున్నాము కానీ అది చివరికి ఒక సాంగ్ లాగా మారింది అని తెలిపింది.
Also Read : Nani – Allu Arjun : పుష్ప 2కు బోలెడన్ని అవార్డులు ఇంటికి తీసుకెళ్ళు.. బన్నీకి రిప్లై ఇచ్చిన నాని..
దీంతో నిహారిక వ్యాఖ్యలు వైరల్ అవ్వగా నిహారిక అఖిల్ తో షార్ట్ ఫిలిం చేసిందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9న రిలీజ్ కాబోతుంది. ఇక అఖిల్ ఏజెంట్ సినిమా తర్వాత ఇంకా ఏ సినిమా అధికారికంగా ప్రకటించకపోయినా యువీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేస్తున్నాడు.