Nani – Allu Arjun : పుష్ప 2కు బోలెడన్ని అవార్డులు ఇంటికి తీసుకెళ్ళు.. బన్నీకి రిప్లై ఇచ్చిన నాని..
నాని షేర్ చేసిన ఫోటోకి అల్లు అర్జున్ కామెంట్స్ చేస్తూ..
Nani – Allu Arjun : ఇటీవల జరిగిన సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ లో తెలుగులో నానికి దసరా సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. దీంతో ఇది మూడోసారి నాని ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం. దీంతో నానికి అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు. నాని ఫిలింఫేర్ అవార్డుతో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
Also Read : Rama Rajamouli : మగధీర సమయంలో యాక్సిడెంట్.. భార్యని చూసి ఏడ్చేసిన రాజమౌళి..
నాని షేర్ చేసిన ఫోటోకి అల్లు అర్జున్ కామెంట్స్ చేస్తూ.. కంగ్రాట్స్. దీనికి నువ్వు అర్హుడివి అని పోస్ట్ చేసాడు. దీనికి నాని రిప్లై ఇస్తూ.. థ్యాంక్యూ బన్నీ. నేను కచ్చితంగా చెప్పగలను నెక్స్ట్ ఇయర్ పుష్ప రూల్ తో నువ్వు చాలా అవార్డులు ఇంటికి తీసుకెళ్తావు అని పోస్ట్ చేసాడు. దీంతో బన్నీ అభిమానులు నాని కామెంట్ షేర్ చేస్తూ అభినందిస్తున్నారు.
Thank you bunny. ??
Am sure next year ‘The Rule’ guy will take many more home. ♥️— Nani (@NameisNani) August 4, 2024