Allu Arha Birthday special Sneha Reddy shared a post and gave wishes
Allu Sneha- Allu Arha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల గారాల పట్టి అల్లు అర్హ గురించి ప్రత్యక పరిచయం అవసరం లేదు. స్టార్ కిడ్ అయినప్పటికీ సాధారణ పిల్లలాగా ఉంటారు అల్లు అర్హ, అయాన్. ఇక ఎల్లప్పుడూ అర్జున్, స్నేహ ఇద్దరు తమ పిల్లలకి సంబందించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా అర్హకి నెట్టింట సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
Also Read : Ram Pothineni : రామ్ కొత్త సినిమా మొదలు.. మిస్టర్ బచ్చన్ భామతో..
అయితే నేడు అర్హ పుట్టిన రోజు. తన పుట్టినరోజు సందర్బంగా స్నేహ తన ముద్దుల కూతురికి విషెష్ చెప్తూ ఓ వీడియో షేర్ చేసింది. ఇక వీడియోకి.. “హ్యాపీ బర్త్ డే మై క్యూటెస్ట్ , స్వీటెస్ట్, బేబీ.. మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాం. మా జీవితంలో ఈ రోజు చాలా ప్రత్యేకం..” అంటూ తన పోస్ట్ లో పేర్కొంది అల్లు స్నేహ రెడ్డి. దీంతో ప్రస్తుతం స్నేహ రెడ్డి చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక అల్లు అర్హ అందరి స్టార్ కిడ్స్ కంటే భిన్నంగా ఉంటుందని చెప్పొచ్చు. అల్లు అర్జున్ ఇద్దరు పిల్లలు చాలా సింపుల్ గా ఉంటారు. అర్హ, అయాన్ ఇద్దరూ ఇంట్లోనే కాకుండా బయటికి ఎక్కడికి వచ్చినా, ఏ ఈవెంట్ కి వచ్చినా కూడా కేవలం తెలుగులోనే మాట్లాడతారు. ఇది చూసి చాలా మంది షాక్ అవుతుంటారు. ఇటీవల బాలయ్య అన్స్టాపబుల్ షోకి వచ్చారు అల్లు అర్జున్ పిల్లలు. ఇక ఈ షోలో అర్హ తెలుగులో పద్యం చెప్పడంతో బాలయ్య సైతం షాక్ అయ్యాడు.