Sneha Reddy : ఈ కాలం పిల్లల్ని ఎలా పెంచాలో అల్లు అర్జున్ భార్య స్నేహా దగ్గర తెలుసుకోండి

అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తన పేరెంటింగ్ మంత్ర చెప్పారు. సోషల్ మీడియాలో స్నేహా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Sneha Reddy : ఈ కాలం పిల్లల్ని ఎలా పెంచాలో అల్లు అర్జున్ భార్య స్నేహా దగ్గర తెలుసుకోండి

Sneha Reddy

Updated On : January 26, 2024 / 12:07 PM IST

Sneha Reddy : బన్నీ భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తరచు అల్లు అర్జున్, కొడుకు అయాన్, కూతురు అర్హ ఫోటోలను షేర్ చేస్తుంటారు. రీసెంట్‌గా స్నేహా  ‘మై పేరెంటింగ్ మంత్ర’ అంటూ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tillu Square : హమ్మయ్య ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్‌కి రెడీ అయ్యింది.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?

పిల్లల్ని పెంచే క్రమంలో పేరెంట్స్‌కి ఖచ్చితంగా ఒక ప్రణాళిక ఉంటుంది. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తన పేరెంటింగ్ మంత్ర అంటూ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ముఖ్యంగా స్నేహా 6 పాయింట్స్ చెప్పారు. 1. పిల్లల్ని కొత్తగా క్రియేటివ్‌గా ఆలోచించేలా ప్రోత్సహించాలి. 2. వారం మొత్తంలో వాళ్లు చేయాల్సిన పనులకు ప్రణాళిక వేసుకోవాలి. 3. ప్రకృతితో గడిపేలా కాసేపు ఎండలో ఉండాలి. 4. స్క్రీన్ టైమ్ తగ్గించడానికి వారిలో ఊహా శక్తి పెంపొందించే పనులను ప్రోత్సహించాలి. 5. పిల్లలో జాలి, కరుణ వంటి గుణాలు పెంపొందించాలి. 6. అన్నింటికంటే ముఖ్యమైనది తల్లులు తమకోసం కొంచెం సమయం కేటాయించుకోవాలి. స్నేహా రెడ్డి షేర్ చేసిన వీడియో నిజంగానే ఆలోచింప చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Chiranjeevi : పద్మ విభూష‌ణ్ అవార్డు పై స్పందించిన చిరంజీవి

స్నేహా రెడ్డి పేరెంటింగ్ టిప్స్ బాగున్నాయని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అమేజింగ్ మదర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అల్లు అర్జున్ సినిమాలతో బిజీగా ఉండగా స్నేహ రెడ్డి పిల్లల్ని చూసుకుంటూనే పికాబూ (Studio Picaboo) అనే ఫోటో స్టూడియో వ్యాపారం చేస్తున్నారు. 2016 లో ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)