Pushpa 2: పుష్ప 2 టికెట్‌ రేట్లను పెంచుకునేందుకు ప్రయత్నాలు.. సింగిల్ స్క్రీన్‌ టికెట్‌ రేట్ రూ.300?

అయితే మిగతా సినిమాలకు సింగిల్‌ స్క్రీన్ టికెట్‌ రేటు 250కి అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. పుష్ప-2 కోసం 300 రూపాయలకు అనుమతి ఇస్తుందా?

Allu Arjun Pushpa 2

పుష్ప..ఫ్లవర్ నహీ. వైల్డ్‌ ఫైర్‌. ఈ డైలాగ్‌తో పుష్ప-2 మూవీపై ఓ రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ అయింది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్లలో రిలీజ్ కాబోతున్న పుష్ప-2 సినిమా బిజినెస్‌ మీద ఫోకస్ పెట్టారట మేకర్స్. టికెట్‌ రేట్లు భారీగా పెంచుకునేందుకు లాబీయింగ్ చేస్తున్నారట. పెద్ద స్టార్ మూవీ అంటే మల్టీప్లెక్స్‌లో ఎలాగో టికెట్‌ రేట్లు ఎక్కువగానే ఉంటాయి.

అందుకు తగ్గట్లుగానే సినిమా రిలీజ్ టైమ్‌లో స్పెషల్ షోలు, అదనపు రేట్లు పెంచుకోవడానికి పుష్ప-2 టీమ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తుందంటున్నారు. ఏపీలో పుష్ప-1కు టికెట్ రేట్లు ఎక్కువ లేకపోవటంతో చాలావరకు కలెక్షన్స్‌పై ప్రభావం పడిందట.

పుష్ప-1 విషయంలో టికెట్‌ రేట్ల పెంపు వర్కౌట్‌ కాకపోవడంతో ఈ సారి కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే కూటమి సర్కార్ కల్కి, దేవర సినిమాలకు సింగిల్ స్క్రీన్ రేట్స్ 250 వరకు పెంచింది. ఎక్కువ కలెక్షన్స్‌పై కన్నేసిన పుష్ప మేకర్స్ ఇంకా అదనంగా రేట్లు పెంచుకునే ప్లాన్ చేస్తున్నారట. సింగిల్ స్ర్కిన్ టికెట్ రేట్ 300 రూపాయల దాకా పెంచుకునే వీలు కల్పించాలని కోరుతున్నారట. సింగిల్ స్క్రిన్‌ టికెట్‌ రేటే అంతుంటే మల్టీప్లెక్స్‌లో టికెట్‌ రేట్లు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సినిమాపై బజ్ క్రియేట్ అవ్వటంతో ప్రేక్షకులు తప్పకుండా వస్తారని, టికెట్ రేట్ల గురించి ఆలోచించరంటున్నారు మేకర్స్.

అయితే మిగతా సినిమాలకు సింగిల్‌ స్క్రీన్ టికెట్‌ రేటు 250కి అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. పుష్ప-2 కోసం 300 రూపాయలకు అనుమతి ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ వర్సెస్‌ అల్లుఅర్జున్ ఫ్యాన్స్ వార్ మళ్లీ స్టార్ట్ అయింది. పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ తర్వాత రెండు గ్రూప్‌ల మధ్య సోషల్ మీడియా వార్ ఇంకా హీటెక్కుతోంది. దీని ఎఫెక్ట్ ఏమైనా పడితే మాత్రం టికెట్ రేట్లు 250 రూపాయలే ఉండొచ్చంటున్నారు.

Bachhala Malli : అల్ల‌రి న‌రేశ్ ‘బ‌చ్చ‌ల మ‌ల్లి’ రిలీజ్ డేట్ ఫిక్స్‌..