Bachhala Malli : అల్ల‌రి న‌రేశ్ ‘బ‌చ్చ‌ల మ‌ల్లి’ రిలీజ్ డేట్ ఫిక్స్‌..

టాలీవుడ్ హీరో అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్న మూవీ ‘బ‌చ్చ‌ల మ‌ల్లి’.

Bachhala Malli : అల్ల‌రి న‌రేశ్ ‘బ‌చ్చ‌ల మ‌ల్లి’ రిలీజ్ డేట్ ఫిక్స్‌..

Allari Naresh Bachhala Malli release date fix

Updated On : November 19, 2024 / 5:32 PM IST

టాలీవుడ్ హీరో అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్న మూవీ ‘బ‌చ్చ‌ల మ‌ల్లి’. సుబ్బు మంగాదేవి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అమృత అయ్యర్ క‌థ‌నాయిక‌. హాస్యా మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.

Pushpa Re Release : పుష్ప పార్ట్ 1 రీ రిలీజ్ ? ఎప్పుడంటే?

డిసెంబ‌ర్ 22న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విశాల్ చంద్ర శేఖ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రావు రమేశ్, హరితేజ, ప్రవీణ్ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. 1990వ ద‌శ‌కంలో తుని ప్రాంతంలో జ‌రిగిన కొన్ని య‌దార్థ సంఘ‌ట‌న‌ల స్పూర్తితో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు.

Sai Dharam Tej : మా ఫామిలీలో ఆ ఇన్సిడెంట్ జరిగింది.. అందుకే ఆ చిన్న పాప విషయంలో అంత రియాక్ట్ అయ్యా..