Allu Arjun : నేషనల్ అవార్డుకు ఎంపికైన ఆనందంలో బన్నీ.. వైరల్ అవుతున్న అల్లు అయాన్ వీడియో..

తన తండ్రి ఏమి సాధించాడో అర్ధంకాక, నేషనల్ అవార్డు అంటే ఏంటో సరిగ్గా తెలియని అల్లు అయాన్..

Allu Arjun : నేషనల్ అవార్డుకు ఎంపికైన ఆనందంలో బన్నీ.. వైరల్ అవుతున్న అల్లు అయాన్ వీడియో..

Allu Ayaan video from Allu Arjun national award winning celebrations gone viral

Updated On : August 25, 2023 / 4:00 PM IST

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది నేషనల్ అవార్డు అందుకోవడమే కాదు, ఫస్ట్ బెస్ట్ యాక్టర్ అవార్డుని కూడా టాలీవుడ్ కి తీసుకు వచ్చాడు. దీంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోని ప్రముఖులు కూడా అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిన్న ఆగష్టు 24న అవార్డు ప్రకటించడంతో అల్లు వారి ఇంట పండుగా వాతావరణం కనిపించింది. కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ వ్యక్తులతో పాటు అభిమానులు కూడా బన్నీ ఇంటి వద్దకు చేరుకున్నారు.

Pushpa 2 : నేషనల్ అవార్డుతో సీక్వెల్ పై మరింత అంచనాలు.. రిలీజ్‌ కోసం ఆ డేట్ ఫిక్స్ చేశారట..!

ఇక శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన అభిమానులకు కృతజ్ఞతులు తెలియజేయడానికి అల్లు అర్జున్ బయటకు వచ్చి ఫ్యాన్స్ కి అభివాదం చేశాడు. అలా బయటకి వేసిన బన్నీని అభిమానులు తమ ఫోన్స్ లో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో అల్లు అయాన్ కూడా ఆ వీడియోలో కనిపించగా అది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. వచ్చిన అభిమానులకు అల్లు అర్జున్ సంతోషంతో అభివాదం చేస్తుంటే.. అల్లు అయాన్ బిల్డింగ్ పై నుంచి అందర్నీ ఆశ్చర్యంగా చూడడం అందర్నీ ఆకట్టుకుంది.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ OG సెట్స్ నుంచి వీడియో లీక్.. నెట్టింట వైరల్!

నేషనల్ అవార్డు అంటే ఏంటో సరిగ్గా తెలియని అయాన్ కి.. తన తండ్రి ఏమి సాధించాడో అర్ధంకాక, వచ్చిన అభిమానులను అలా అయోమయంతో చూడడం ప్రతి ఒక్కర్ని ఆకర్షిస్తుంది. ఈ వీడియోని బన్నీ అభిమానులతో పాటు కొందరు నెటిజెన్స్ కూడా రీ షేర్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. మరి ఆ క్యూట్ వీడియోని ఒకసారి మీరుకూడా చూసేయండి.

కాగా అల్లు అర్జున్ పుష్ప 1 సినిమాకు గాను నేషనల్ అవార్డు అందుకోవడంతో సీక్వెల్ పై మరింత క్రేజ్ ఏర్పడింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కూడా ఈ సినిమాకే అవార్డు అందుకోవడంతో సుకుమార్ సెకండ్ పార్ట్ పై మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం పడింది. ఈ మూవీ రిలీజ్ ని వచ్చే ఏడాది సమ్మర్ లో మార్చి 22న ప్లాన్ చేస్తున్నారట.