Allu Business Park : అల్లు బిజినెస్ పార్క్ లాంచ్.. ముని మనవడితో రామలింగయ్య విగ్రహావిష్కరణ..
అల్లు బిజినెస్ పార్క్ లాంచ్ చేసిన అల్లు ఫ్యామిలీ. ముని మనవుడు చేతులు మీదుగా రామలింగయ్య విగ్రహావిష్కరణ.

Allu Ramalingaiah Statue opened at Allu Business Park
Allu Business Park : అల్లు ఫ్యామిలీ ఈ ఏడాది ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్ లో AAA సినిమాస్ స్టార్ట్ చేసి మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగు పెట్టారు. అది సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఆ తరువాత అల్లు అర్జున్ కి ప్రతిష్టాత్మక నేషనల్ అవార్డు రావడం కుటుంబం మొత్తం ఎంతో గౌరవంగా భావించింది. అలాగే లండన్‌లోని ప్రఖ్యాతి మేడమ్ టుస్సాడ్స్ (Madame Tussauds) మ్యూజియంలో కూడా బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఇలా వరుస శుభాలతో అల్లు ఫ్యామిలీ ఫుల్ జోష్ లో ఉన్నారు.
Nagabhushana : కన్నడ యాక్టర్ ర్యాష్ డ్రైవింగ్.. మహిళ మృతి.. అరెస్ట్ చేసిన పోలీసులు..
తాజాగా ఈ ఫ్యామిలీ ‘అల్లు బిజినెస్ పార్క్’ని లాంచ్ చేసింది. నేడు అక్టోబర్ 1 అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) 101వ జయంతి కావడంతో ఈ బిజినెస్ పార్క్ ని లాంచ్ చేశారు. అక్కడే అల్లు రామలింగయ్య ‘కాంస్యం విగ్రహాన్ని’ (Bronze Statue) ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణ రామలింగయ్య ముని మనవుడు ‘అల్లు అయాన్’ చేతులు మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, చిరంజీవి సతీమణి సురేఖ, అల్లు శిరీష్ ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను గీతాఆర్ట్స్ సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు.
Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు కోసం చంటిబిడ్డను ఎత్తుకున్న రేణు దేశాయ్
— Geetha Arts (@GeethaArts) October 1, 2023
Here are the Highlights from the launch of Allu Business Park and the bronze statue inauguration of Padma Shri Dr. #AlluRamalingaiah garu on the occasion of his 101st Birth Anniversary. pic.twitter.com/DGz221Hz1m
— Geetha Arts (@GeethaArts) October 1, 2023
కాగా అల్లు రామలింగయ్య 1922 లో అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ లోని పాలకొల్లులో జన్మించారు. 81 ఏళ్ళ వయసులో 2004లో ఆయన మరణించారు. 1950లో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన అల్లు రామలింగయ్య దాదాపు 1000 సినిమాల్లో నటించారు. నటుడిగా, విలన్ గా, కమెడియన్ గా ఎన్నో పాత్రలను తనదైన శైలిలో చేసి.. స్టేట్ నుంచి నేషనల్ వరకు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అల్లు ఫ్యామిలీ ఈయన పేరు మీద ‘అల్లు రామలింగయ్య నేషనల్ అవార్డు’ అంటూ ఇప్పటి వారికి అవార్డులు ఇస్తూ వస్తున్నారు.