Allu Sirish lovely post about Devara NTR
NTR : మ్యాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్ తన తోటి నటీనటులతో అభిమానులతో ఎంత ప్రేమగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పెద్ద అని హోదా చూడరు ప్రతి ఒక్కరితో ఇట్టే కలిసి పోతారు. అభిమానులతో అయినా సరే అంతే ప్రేమగా ఉంటారు. ఇక ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య ఉన్న బంధం గురించి అందరికి తెలిసిందే. ఒకరిని ఒకరు బావ అని పిలుచుకుంటూ సినిమా ఫంక్షన్స్ లో, సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. ఇక తాజాగా అల్లు శిరీష్, ఎన్టీఆర్ గురించి ఒక పోస్ట్ వేశారు.
ఇటీవల చిరంజీవి ఇంటిలో దివాళీ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సెలబ్రేషన్స్ కి ఎన్టీఆర్, మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జునతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరయ్యి సందడి చేశారు. ఇక మెగా ఇంట వేడుకలు అంటే అల్లు ఫ్యామిలీ లేకుండా జరగదు కదా. ఆ సెలబ్రేషన్ లో అల్లు శిరీష్, ఎన్టీఆర్ దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. “ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఎవరు ఎప్పుడు తనతో ఒక ఫోటో అడిగినా తారక్ అన్న అందరితో ఒకేలా ఉంటారు. వారికి ప్రేమతో ఒక ఫోటో ఇస్తారు. చాలా ప్రేమ ఉన్న మనిషి” అంటూ చెప్పుకొచ్చారు.
Also read : ET Express : 23 ఏళ్లు సినిమా జర్నీ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. మహేశ్‌బాబు చేయూత..
Friends, family or fans I see the same warmth and affection whenever someone asks Tarak anna for a photo. The most kind hearted. ♥️♥️♥️ #deepavali2023 pic.twitter.com/N5MiXqKQZB
— Allu Sirish (@AlluSirish) November 16, 2023
ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పిక్ చూసిన కొందరు ఫ్యాన్స్.. ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ కలిసి ఉన్న ఫోటో కూడా షేర్ చేయమని అడుగుతున్నారు. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దివాళీ తరువాత మొదలైన షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు మూవీలోని పలు ప్రధాన పాత్రలు షూటింగ్ లో పాల్గొంటున్నాయి. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.