ET Express : 23 ఏళ్లు సినిమా జర్నీ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. మహేశ్‌బాబు చేయూత..

టాలీవుడ్ టు బాలీవుడ్ సినిమా అప్డేట్స్ వైపు ఒక లుక్ వేసేయండి. ఎన్టీఆర్ 23 ఏళ్లు సినిమా జర్నీ పూర్తి చేసుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ పేరుతో..

ET Express : 23 ఏళ్లు సినిమా జర్నీ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. మహేశ్‌బాబు చేయూత..

ET 20_ Latest Entertainment News Today on 16 November at 6_30PM

Updated On : November 16, 2023 / 6:35 PM IST

NTR@23..
తెలుగు సినీ పరిశ్రమలో.. నేటితో జూనియర్ ఎన్టీఆర్‌ 23 ఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫొటోలను షేర్ చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోగా ఎన్టీఆర్‌ ఎదిగారు. రామాయణం సినిమాలో రాముడిగా కెరీర్ మొదలు పెట్టి.. ఆర్ఆర్ఆర్‌లో భీముడుగా తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు.

రాజు యాదవ్‌ నుంచి ఫుల్ సాంగ్..
కమెడీయన్ గెటప్ శ్రీను.. అంకిత కారత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా రాజుయాదవ్. ఈ సినిమా నుంచి రాజుయాదవ్ చూడు అనే పూర్తి సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రోమో సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాకు కిట్టు దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మంగళవారం మేకింగ్ వీడియో రిలీజ్‌..
పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మంగళవారం. అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్‌ ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఆకట్టుకుంటుంది.

ఓటీటీలోకి ఘోస్ట్‌..
కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌ నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఘోస్ట్‌’. శ్రీని దర్శకత్వంలో సందేశ్‌ నాగరాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆసక్తికరమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. రేపటి నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో ది రైల్వేమెన్‌..
భోపాల్ గ్యాస్ దుర్ఘటన నేపథ్యంలో వచ్చిన వెట్ సిరీస్‌ ది రైల్వే మెన్‌. ఈ సిరీస్‌ను.. ఇండియ‌న్ మోస్ట్ ప్రెస్టీజియస్ బ్యాన‌ర్ యష్ రాజ్ ఫిలిమ్స్, ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ క‌లిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈ సిరీస్‌ నవంబర్‌ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆర్. మాధవన్, కే కే మీనన్, దివ్యేండు శర్మ ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ వెబ్ సిరీస్‌కు శివ్ రావైల్ దర్శకత్వం వహించారు.

మహేశ్‌బాబు చేయూత..
సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారు సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు. తన తండ్రి కృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా మరోసారి మంచి మనసు చాటుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ పేరుతో పేద విద్యార్థులకు అండగా నిలిచారు. 40 మందికి పైగా విద్యార్థులను ఎంపిక చేసి ఈ స్కాలర్‌షిప్ అందించనున్నారు.

బ్లాక్‌బస్టర్‌ సినిమాకు పదేళ్లు..
రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణే నటించిన సెన్సెషనల్ సినిమా రామ్‌లీల. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా.. దీపికా పదుకొణెతో దిగిన ఫొటోలను రణ్‌వీర్ సింగ్‌ షేర్‌ చేశారు. ఆ సినిమా తమ జీవితాలను పూర్తిగా మార్చేసిందని ఆయన అన్నారు.

ట్రెడిషనల్‌ డ్రెస్‌లో మృణాల్‌..
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన నటి మృణాల్ ఠాకూర్‌. ఈ సినిమాతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొంది ఈ బ్యూటీ. దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

Photos see here : Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ మెస్మరైజింగ్ లుక్స్..

అమెజాన్‌లో దూత వెబ్ సిరీస్‌..
నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ దూత. విక్రమ్‌ కె.కుమార్‌ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. శరత్‌ మరార్‌ నిర్మాతగా వ్యవహరించగా.. ప్రియా భవానీ శంకర్‌, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌ డిసెంబరు 1న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

సంక్రాంతి బరిలో విజయ్ సేతుపతి..
జవాన్‌ సినిమాలో విలన్‌గా స్టన్నింగ్ యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. తాజాగా విజయ్ సేతుపతి న‌టిస్తున్న మ‌రో బాలీవుడ్ చిత్రం మేరీ క్రిస్మస్‌. కత్రినా కైఫ్ క‌థ‌నాయిక‌గా న‌టిస్తుండ‌గా.. బద్లాపూర్, అంధధూన్ సినిమాల ఫేమ్ శ్రీ‌రామ్ రాఘ‌వ‌న్ ఈ సినిమాకు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌నున్నట్లు చిత్రబృందం ప్రక‌టించింది.

రేపు ఏ చోట నువ్వున్నా విడుదల..
ఎమ్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శాఖమూరి శ్రీనివాసరావు సమర్పణలో.. ఎస్‌ వి. పసలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పల్లెటూరి ప్రేమకథా చిత్రం ఏ చోట నువ్వున్నా. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. మందలపు శ్రీనివాసరావు- మేడికొండ శ్రీనివాసరావు ఈ సినిమాను నిర్మించారు.

డిసెంబర్‌లో “గేమ్‌ ఛేంజర్‌” ఫస్ట్‌ సాంగ్‌..?
డిసెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో “గేమ్‌ ఛేంజర్‌” మూవీ ఫస్ట్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేసేందుకు మూవీ టీమ్‌ కసరత్తు చేస్తోంది. కొన్ని టెక్నికల్‌ ఇష్యూస్‌ వల్ల “జరగండి” అనే పల్లవితో సాగే సాంగ్‌ విడుదల ఇటీవల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్‌కు సంబంధించి మేకర్స్‌ నుంచి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్‌ రావాల్సి ఉంది. ఈ మూవీలో శ్రీకాంత్, సునీల్ అంజలి, ఎస్ జె సూర్య తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. మరోవైపు మెగా పవన్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి థమన్‌ సంగీతం అందిస్తున్నారు.

అట్లీ కొత్త మూవీలో హాలీవుడ్ రైటర్?
సెన్సేషన్‌ డైరెక్టర్‌ అట్లీ… తన నెక్స్ట్‌ మూవీ కోసం బిగ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మూవీ కోసం హాలీవుడ్‌ రైటర్‌తో కలిసి పనిచేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మూవీని మల్టీ స్టారర్‌గా షారూఖ్‌, విజయ్‌తో కలిసి చేయాలని ప్లాన్‌ చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తుంది. మరోవైపు అట్లీ డైరెక్షన్‌లో వచ్చి జవాన్‌ వెయ్యి కోట్ల గ్రాస్‌ క్లబ్‌లో చేరింది.

“సలార్‌” ఏపీ డిస్ట్రిబ్యూటర్స్‌ అనౌన్స్‌..
“సలార్‌” మూవీ ఏపీ డిస్ట్రిబ్యూటర్స్‌ను అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. వచ్చేనెల 22న వరల్డ్‌ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్‌ కానుంది. ఉత్తరాంధ్రలో శ్రీ సిరి సాయి సినిమాస్, తూర్పుగోదావరిలో లక్ష్మీ నరసింహ శ్రీ మణికంఠ ఫిలిమ్స్, పశ్చిమ గోదావరిలో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, కృష్ణా, గుంటూరు రీజియన్లలో కెఎస్ఎన్ టెలి ఫిలిమ్స్, నెల్లూరులోని శ్రీ వెంగబాంబ సినిమాస్, సీడెడ్‌లోని శిల్పకళా ఎంటర్‌టైన్‌మెంట్స్ “సలార్‌” మూవీని గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నారు.

“హాయ్‌ నాన్న” నుంచి తీపి జ్ఞాపకాలు..
న్యాచురల్‌ స్టార్‌ నాని, అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌ జంటగా శౌర్యువ్ డైరెక్షన్‌లో వచ్చేనెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తుంది “హాయ్‌ నాన్న”. ఈ మూవీ నుంచి స్వీట్ మెమరీస్ అంటూ వీడియో షేర్ చేసుకున్నారు హీరో నాని. నాని సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

రేపు “ఆదికేశవ” ట్రైలర్‌ రిలీజ్‌..
“ఆదికేశవ” మూవీ ట్రైలర్‌ రేపు గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్‌పై ఈ మూవీ రిలీజ్‌ అవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన లీలమ్మ సాంగ్‌ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.

రేపు 17న “అన్వేషి” రిలీజ్‌..
“అన్వేషి” మూవీ రేపు రిలీజ్‌కు సిద్ధమైంది. విజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించారు. అడవి నేపథ్యంలో సాగే ఈమూవీని డైరెక్టర్‌ వి.జె.ఖన్నా తెరకెక్కించారు. హీరోయిన్‌ చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని చిత్రబృందం తెలిపింది.

“కోట బొమ్మాళి” అదుర్స్‌-శివానీ రాజశేఖర్‌..
రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ లీడ్‌ రోల్స్‌లో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలు పోషించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. నవంబర్ 24న సినిమా విడుదలవుతున్నఈ సినిమా ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ అందిస్తుందన్నారు శివానీ రాజశేఖర్. మరోవైపు కోటబొమ్మాళి మూవీ టీజర్‌కు బంపర్‌ రెస్పాన్స్‌ లభిస్తోంది.

“అథర్వ” ట్రైలర్‌ రిలీజ్‌..
“అథర్వ” మూవీ ట్రైలర్‌ రిలీజైంది. డిసెంబర్‌ 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మూవీ మేకర్స్‌ వెల్లడించారు. ఈ మూవీలో కార్తీక్‌ రాజు, సిమ్రాన్‌ చౌదరి, ఐరా హీరో హీరోయిన్లుగా నటించారు. మహేశ్‌రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ వచ్చేనెల 1న అన్ని సౌత్‌ లాంగ్వేజెస్‌లో రిలీజ్‌ కానుంది.

“సుట్టంలా సూసి” సాంగ్‌కు భారీ రెస్పాన్స్‌..
విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి హీరోయిన్‌గాగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. ఈ సినిమాలోని “సుట్టంలా సూసి” పాటకు యూట్యూబ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఈ పాటకు యూట్యూబ్‌లో 2 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.