Amala Paul: బోల్డ్ లుక్‌తో అమలాపాల్.. బౌండరీస్ క్రాస్ చేసేస్తుందా?

ఈ మధ్య కాలంలో మన కథానాయికలు సినిమాల మీద ఎంత కాన్షన్ ట్రేషన్ చేస్తున్నారో హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాను ఎంగేజ్ చేయడం మీద కూడా అంతే దృష్టి పెడుతున్నారు..

Amala Paul: బోల్డ్ లుక్‌తో అమలాపాల్.. బౌండరీస్ క్రాస్ చేసేస్తుందా?

Amala Paul

Updated On : September 26, 2021 / 4:51 PM IST

Amala Paul: ఈ మధ్య కాలంలో మన కథానాయికలు సినిమాల మీద ఎంత కాన్షన్ ట్రేషన్ చేస్తున్నారో హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాను ఎంగేజ్ చేయడం మీద కూడా అంతే దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత సోషల్ మీడియాకు బాగా దగ్గరైన నాయకలు.. కొత్త అవకాశాలను పట్టేందుకు మార్గంగా సోషల్ మీడియాను భావిస్తున్నారు. ఇందులో మలయాళ భామ అమల పాల్ ముందు వరసలో ఉందేమో అనిపిస్తుంది.

Most Eligible Bachelor: మళ్ళీ వెనక్కి వెళ్లిన బ్యాచిలర్! రిలీజ్ ఎప్పుడంటే..?

ఇద్దరమ్మాయిలు, నాయక్, జెండాపై కపిరాజు తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అమలాపాల్ తమిళ, మలయాళ సినిమాలలో కూడా బాగానే పేరు తెచ్చుకుంది. అయితే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు బాగా దూరవమగా తమిళ, మలయాళంలో కూడా భారీ అవకాశాలను అందుకోలేకపోతుంది. అందుకే ఇప్పుడు బోల్డ్ లుక్ లో ఫోటో షూట్లతో పాటు పర్సనల్ ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా గాలమేసి యువతను ఆకట్టుకుంటుంది.

Pawan-Mahesh: పవన్ స్పీచ్.. మహేష్ ట్వీట్ వైరల్!

ఆ మధ్య ‘ఆమె’ సినిమాలో పూర్తి న్యూడ్ లుక్‌లో దర్శనం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచిన అమలా ఇప్పుడు బికినీతో ఫోటో షూట్లను విడుదల చేస్తుంది. అమ్మడి వాలకం చూసిన నెటిజన్లు ఉన్న చిన్న చితకా బౌండరీలను కూడా అమలా క్రాస్ చేస్తుందా అని కామెంట్ చేస్తున్నారు. ఏమాట కామాట కానీ అమలా నాజూకు అందాలకు కుర్రాళ్ళ మతులు పోతున్నాయి. బికినిలో సూపర్ హాట్ గా ఆమె ఇచ్చిన ఫోజులు తెగ వైరల్ అవుతున్నాయి.