Tejaswini Gowda : నాన్న చనిపోయారు.. కొన్ని పరిస్థితుల్లో నాన్న ఉంటే బాగుండు అనిపించేది.. తేజస్విని గౌడ ఎమోషనల్ కామెంట్స్..

ఈ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి చెప్తూ ఎమోషనల్ అయింది తేజస్విని గౌడ.

Amardeep Wife Tejaswini Gowda gets Emotional while Telling about her Father

Tejaswini Gowda : సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న తేజస్విని గౌడ రెండేళ్ల క్రితం అమర్ దీప్ ని పెళ్లి చేసుకొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం తేజస్విని గౌడ టీవీ షోలు, సీరియల్స్ తో బిజీగానే ఉండి. తాజాగా నటి తేజస్విని గౌడ ఆహా ఓటీటీలో వస్తున్న కాకమ్మ కథలు ఇంటర్వ్యూ ప్రోగ్రాంకి రాగా ఈ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి చెప్తూ ఎమోషనల్ అయింది.

Also Read : Dil Raju : శతమానం భవతి సీక్వెల్, ఆర్య 3.. రెండు సినిమాలు ఆ హీరోతోనే చేయనున్న దిల్ రాజు..?

తేజస్విని గౌడ మాట్లాడుతూ.. పెరుగుతున్న ఏజ్ లో నాన్న లేరు. అందుకే స్ట్రాంగ్ గా అయ్యాను. ఫాదర్ లేకపోయినా అమ్మ బాగా చూసుకుంది. నాన్న నాకెందుకు లేరు అని బాధగా ఉంటుంది. గత రెండేళ్లలో వచ్చిన కొన్ని పరిస్థితుల్లో నాన్న ఈ టైంలో ఉంటే బాగుండేది కదా అనిపించేది అని చెప్తూ ఎమోషనల్ అయింది. తేజస్విని గౌడ ఇంటర్ చదివే సమయంలో తన తండ్రి హార్ట్ అటాక్ తో చనిపోయారని గతంలో తెలిపింది.

Also Read : Amardeep – Tejaswini Gowda : అమర్ దీప్ – తేజస్విని లవ్ స్టోరీ గురించి తెలుసా? అసలు లవ్ ప్రపోజల్ లేకుండానే..