వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంది.. కరోనా చికిత్స అవసరం లేదు..

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్‌ల ఆరోగ‍్యం ప్రస్తుతం స్థిమితంగా ఉందని ముంబై నానావతి హాస్పిటల్ వైద్యులు సోమవారం వెల్లడించారు. జూలైన 11 బిగ్‌బి, అభిషేక్‌లకు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరిన వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, వారికి పెద్దగా కరోనా చికిత్స అందించాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
తనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు బిగ్‌బి శనివారం(జూలై 11) సోషల్ మీడియాలో ప్రకటించారు. దీంతో బచ్చన్ సార్ మీరు త్వరగా కోలుకోవాలి, క్షేమంగా ఉండాలి అంటూ సోషల్ మీడియాలో పలు భాషలకు చెందిన సినీ స్టార్స్, వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, నెటిజన్లు, అభిమానులు పోస్టులు చేశారు. తర్వాత అదే రోజు రాత్రి ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా తనకు కోరోనా పాజిటివ్ వచ్చినట్లు ట్వీట్ చేస్తూ..‘నాకు, నా తండ్రి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. మాకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చేరాము’ అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఆదివారం అభిషేక్ మరో ట్వీట్ చేస్తూ తన భార్య ఐశ్వర్య రాయ్ బచ్చన్, కూతురు ఆరాధ్య బచ్చన్‌లకు కూడా పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తండ్రీ కొడుకులకు పెద్దగా కరోనా పరీక్షలు అవసరం లేదని వైద్యులు చెప్పడంతో సినీ ప్రముఖులు, అభిమానులు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు.
Read Here>>RRR కోసం రూటు మార్చిన రాజమౌళి… వకీల్ సాబ్ కూడా అక్కడే