Amitabh Bachchan
Amitabh Bachchan : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 15 వ సీజన్ చివరి ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. ఈ ఎపిసోడ్ మొత్తం భావోద్వేగంతో నిండిపోయింది. ఇప్పటికే 14 సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ షో 15 వ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ కూడా పూర్తికావడంతో ప్రేక్షకులతో పాటు అమితాబ్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.
R Narayana Murthy : విశాఖ ఉక్కు ఉద్యమంపై పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా?
కౌన్ బనేగా కరోడ్‌పతి ఈ షో హోస్ట్‌గా అమితాబ్ బచ్చన్‌ను తప్ప వేరెవ్వరిని ఊహించలేం. అంత చక్కగా ఆ షో నిర్వహిస్తారాయన. కోట్లాదిమంది అభిమానుల ప్రజాదరణ పొందిన ఈ షో తాజాగా 15 వ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సీజన్ చివరి ఎపిసోడ్‌లో విద్యా బాలన్, షీలాదేవి, షర్మిలా ఠాగూర్, సారా అలీఖాన్‌లు గెస్ట్‌లుగా వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంలో అమితాబ్ అన్ని సీజన్లకు సంబంధించిన కేబీసీ వీడియోను నిర్వాహకులు ప్లే చేశారు. వీడియోలో ప్రేక్షకులు తమ అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత అమితాబ్ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు.
Year End Roundup 2023 : 2023లో భారీ ఫ్లాప్స్ చూసిన తెలుగు సినిమాలు ఇవే..
వీడియో ప్లే చేసిన అనంతరం ‘ఈరోజు చివరి షో అని చెప్పడానికి చాలా బాధగా ఉందని, ఇలాంటి రోజు వస్తుందని ఈ జర్నీ ప్రారంభించినప్పుడే తెలుసునని.. ఈ షో ద్వారా ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయని అమితాబ్ అన్నారు. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదని కోరుకుంటున్నట్లు అమితాబ్ భావోద్వేగంతో చెప్పారు. అమితాబ్ మాటలు విన్న ప్రతి ప్రేక్షకుడి గుండె బరువెక్కింది. అమితాబ్‌ని మరలా హాట్ సీట్‌లో చూడాలంటే నెక్ట్స్ సీజన్ కోసం ఎదురుచూడాల్సిందే.