Year End Roundup 2023 : 2023లో భారీ ఫ్లాప్స్ చూసిన తెలుగు సినిమాలు ఇవే..
2023 లో భారీ ఎక్స్ పెక్టేషన్స్‌తో చాలానే సినిమాలు విడుదలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమా భోళాశంకర్, రవితేజ రావణాసుర, నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ వంటి సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. 2023 లో భారీగా ఫ్లాప్ మూటకట్టుకున్న సినిమాలు ఒకసారి చూద్దాం.

Year End Roundup 2023
Year End Roundup 2023 : 2023 లో టాలీవుడ్‌లో భారీ సంఖ్యలో సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని సూపర్ హిట్ అయ్యాయి. కొన్ని యావరేజ్‌గా నిలిస్తే మరికొన్ని చతికిలపడ్డాయి. ఓవరాల్‌గా టాలీవుడ్ లో కొన్ని తెలుగు సినిమాలకు కలిసి రాలేదని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాతో పాటు గోపీచంద్, వైష్ణవ్ తేజ్, సుధీర్ బాబు, నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలు కూడా అనుకున్నట్లుగా జనాల్లో రీచ్ కాలేకపోయాయి. ఈ ఏడాది ఎక్కువ సినిమాల్లో నటించిన హీరో సంతోష్ శోభన్ కూడా ఒక్క హిట్ అందుకోలేకపోయారు.
Samantha : సమంత జిమ్ వీడియో.. ఇయర్ ఎండ్ ట్రీట్.. వామ్మో ఎంత బరువు మోసిందో చూడండి..
జనవరి : సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్ నటించిన ‘కళ్యాణం కమనీయం’ జనవరి 14 న రిలీజైంది సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హంట్’ జనవరి 26 న విడుదలై పరాజయం పాలైంది.
ఫిబ్రవరి : అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట నటించిన ‘బుట్టబొమ్మ’ ఫిబ్రవరి 4 విడుదలైంది. నందమూరి కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్ నటించిన అమిగోస్ ఫిబ్రవరి 10 న విడుదలైంది. ‘శ్రీదేవి శోభన్ బాబు’ ఫిబ్రవరి 18 న విడుదలైంది. సంతోష్ శోభన్, గౌరీ జి.కిషన్ ఈ సినిమాలో నటించారు. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్, దివ్యాంశ్ కౌశిక్ నటించిన ‘మైఖేల్’ సినిమా ఫిబ్రవరి 24 న విడుదలైంది. ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
మార్చి : ఆది సాయికుమార్, మీసా నారంగ్ నందిని రాయ్ నటించిన ‘CSI సనాతన్’ మార్చి 10 విడులైంది. నాగశౌర్య , మాళవిక నాయర్ నటించిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మార్చి 17 న విడుదలైంది.
Ram Charan : రామ్ చరణ్‌తో ‘డంకీ’ డైరెక్టర్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన రాజ్ కుమార్ హిరాణి..
ఏప్రియల్ : రవితేజ, జయరామ్, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్ నటించిన ‘రావణాసుర’ ఏప్రియల్ 7 న విడుదలైంది. కిరణ్ అబ్బవరం, అతుల్య రవి నటించిన ‘మీటర్’ సినిమా కూడా ఏప్రియల్ 7 న థియేటర్లలోకి వచ్చింది. సమంత, మోహన్ బాబు, దేవ్ మోహన్ నటించిన ‘శాకుంతలం’ ఏప్రియల్ 14 న విడుదలైంది. అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య నటించిన ‘ఏజెంట్’ సినిమా ఏప్రియల్ 28 న విడుదలైంది. ఇవేమీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
మే : గోపీచంద్, జగపతిబాబు, డింపుల్ హయతి, ఖుష్బూ నటించిన ‘రామబాణం’ మే 3 న థియేటర్లలోకి వచ్చింది. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ నటించిన ‘అన్నీ మంచి శకునములే’ సినిమా మే 18 న విడుదలైంది.
జూన్ : దగ్గుబాటి అభిరామ్, గీతికా, సముద్రఖని నటించిన ‘అహింస’ జూన్ 2 న విడుదలైంది.
Year End Roundup 2023 : 2023 లో డీప్ ఫేక్ బారిన పడ్డ హీరోయిన్స్ వీళ్లే
ఆగస్టు : సంతోష్ శోభన్, రాశి సింగ్ నటించిన ‘ప్రేమ్ కుమార్’ ఆగస్టు 18 న థియేటర్లలోకి వచ్చింది. వరుణ్ తేజ్, సాక్షి వైద్య నటించినే ‘గాండీవదారి అర్జున’ ఆగస్టు 25 న విడుదలైంది.
సెప్టెంబర్ : మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ నటించిన ‘భోళా శంకర్’ సినిమా సెప్టెంబర్ 15 న విడుదలైంది.
అక్టోబర్ : సుధీర్ బాబు, మర్నాళిని రవి, ఈషా రెబ్బా నటించిన ‘మామా మశ్చీంద్ర’ సినిమా అక్టోబర్ 6 న విడుదలైంది. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి నటించిన ‘రూల్స్ రంజన్’ అక్టోబర్ 6 న విడుదలైంది.
నవంబర్ : వైష్ణవ్ తేజ్, అపర్ణాదాస్ నటించిన ‘ఆదికేశవ’ సినిమా నవంబర్ 24 న విడుదలైంది.
డిసెంబర్ : నితిన్, శ్రీలీల నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా డిసెంబర్ 8 న విడుదలైంది.
2023 ఈ సినిమాలకు అంతగా కలిసిరాలేదని చెప్పాలి. కథలో కొత్తదనం లేకపోవడం.. నటీనటులు అంతగా ఆకట్టుకోలేకపోవడం కావచ్చు.. డైరెక్షన్ లో లోపాలు కావచ్చు.. ఏది ఏమైనా ప్రేక్షకులు వీటికి పట్టం కట్టలేకపోయారు. 2024 లో అయినా కొత్త కథలతో.. సరికొత్త సినిమాలు రావాలని.. జనాలు ఆదరించాలని మనసారా కోరుకుందాం.