Year End Roundup 2023 : 2023 లో డీప్ ఫేక్ బారిన పడ్డ హీరోయిన్స్ వీళ్లే

2023 వ సంవత్సరం డీప్ ఫేక్ దేశాన్ని కలవరపెట్టింది. సినీ సెలబ్రిటీలే కాదు రాజకీయ నాయకులు సైతం డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. అటూ సోషల్ మీడియా వేదికలు సైతం డీప్ ఫేక్‌ను యూజర్లు గుర్తించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి.

Year End Roundup 2023 : 2023 లో డీప్ ఫేక్ బారిన పడ్డ హీరోయిన్స్ వీళ్లే

Year End Roundup 2023

Updated On : December 31, 2023 / 11:54 AM IST

Year End Roundup 2023 : 2023 వ సంవత్సరం డీప్ ఫేక్ భారత్‌ను కుదిపేసింది. అనేకమంది సినీ సెలబ్రిటీలు డీప్ ఫేక్ బారిన పడ్డారు. రాజకీయ నాయకులను సైతం డీప్ ఫేక్ కలవరపెట్టింది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ ఏడాది డీప్ ఫేక్ బారిన పడ్డ సెలబ్రిటీలు ఎవరో చూద్దాం.

Naa Saami Ranga : ‘నా సామిరంగ’ టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. ముగ్గురు హీరోల స్టెప్పులు చూశారా?

డీప్ ఫేక్ భారత్‌లో హాట్ టాపిక్ గా మారింది. అమెరికా, యూకే వంటి ప్రపంచ దేశాల్లోనూ దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది. నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ ఒక్కసారిగా వైరల్ అవడంతో నేషనల్ వైడ్ చర్చ జరిగింది. ఏఐ ఆధారంగా రూపొందిన ఈ వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బ్రిటీష్ ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్ జారా పటేల్‌ ఒరిజినల్ వీడియోకు రష్మిక ముఖంతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసారు. ఆ వీడియోపై అమితాబ్ బచ్చన్ చిరంజీవి, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఎమ్మెల్సీ కవిత, నాగ చైతన్య, చిన్మయి శ్రీపాద, సాయి ధరమ్ తేజ్ వంటి వారంతా స్పందించారు. ఈ ఘటనపై రష్మిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రష్మిక డీప్ ఫేక్ వీడియో తర్వాత కాజల్ డ్రెస్ ఛేంజింగ్ వీడియో అంటూ ఓ డీప్ ఫేక్ వీడియో వైరల్ అయ్యింది. అలియా భట్‌ను డీప్ ఫేక్ వీడియోలో మరింత బోల్డ్ గా చూపించే ప్రయత్నం చేసారు. కత్రీనా టైగర్ 3 లో టవల్ ఫైట్‌లో ముఖాన్ని మార్ఫింగ్ చేసారు. ఇక సచిన్ కూతురు సారా టెండూల్కర్ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. క్రికెటర్ శుభమాన్ గిల్‌తో సారా ఉన్నట్లు ఫోటోలను మార్ఫింగ్ చేశారు. దీనిపై స్పందించిన సారా తన పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి తప్పు దోవ పట్టిస్తున్నారని అలాంటి ఖాతాలను సస్పెండ్ చేయాలని కోరారు.  ఇక ఐశ్వర్యారాయ్ బచ్చన్, ప్రియాంక చోప్రాలను కూడా డీప్ ఫేక్ వదిలిపెట్టలేదు. అయితే ఈ వీడియోలు చూసినప్పుడు ఒరిజినల్ కాదని చూడగానే అర్ధమైపోతుంది.

Star Directors : 2023 సినిమా ఇండస్ట్రీని ఊపేసిన టాప్ 5 డైరెక్టర్స్ వీళ్ళే.. భారీ సినిమాలతో..

డీప్ ఫేక్ పై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో కేంద్రం కొత్త చట్టం తీసుకువచ్చేందుకు సన్నద్ధమైంది. డీప్ ఫేక్ వీడియోలు పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్రమంత్రి చంద్రశేఖర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డీప్ ఫేక్ అరికట్టడానికి కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. డీప్ ఫేక్‌ను గుర్తించడానికి కొన్ని టూల్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ప్రకటనదారులు వాటిని గుర్తించేలా కొత్త విధానాన్ని మెటా తీసుకొచ్చింది. దీని ద్వారా డిజిటల్‌గా రూపొందించిన లేదా ఎడిట్ చేసిన ఫేక్ అని యూజర్లు గుర్తించే అవకాశం ఉంటుంది.