R Narayana Murthy : విశాఖ ఉక్కు ఉద్యమంపై పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా?
ఇటీవలే యూనివర్సిటీ అనే సినిమాతో వచ్చిన ఆర్ నారాయణమూర్తి త్వరలో మరో సినిమాతో రాబోతున్నారు.

People Star R Narayana Murthy Next Movie on Vizag Steel Plant Issue
R Narayana Murthy : పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మొదటి నుంచి విప్లవాత్మక సినిమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎన్నో సూపర్ హిట్ విప్లవ సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించి, కొన్ని సినిమాలు నిర్మించి పీపుల్ స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు కూడా అడపాదడపా సందేశాత్మక సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే యూనివర్సిటీ అనే సినిమాతో వచ్చిన నారాయణమూర్తి త్వరలో మరో సినిమాతో రాబోతున్నారు.
గత కొన్నాళ్ళుగా వైజాగ్ లో ఉన్న విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం అడుగులు వేస్తుండటంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. విశాఖ స్టీల్ కార్మికులు, దాన్ని ఆధారపడి చుట్టూ అక్కడ బతికేవాళ్లు, ఆంధ్ర ప్రజలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పలు నిరసన కార్యక్రమాలు, దీక్షలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అనే నినాదం బాగా వైరల్ అయింది.
Also Read : Salaar Climax : సలార్ సినిమా క్లైమాక్స్ డైలాగ్ ఇదే.. వీడియో రిలీజ్..
పీపుల్ స్టార్ R నారాయణ మూర్తి ఇప్పుడు ఇదే నినాదాన్ని టైటిల్ గా తీసుకొని సినిమాని తెరకెక్కించబోతున్న. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే టైటిల్ తో నారాయణమూర్తి త్వరలో విశాఖ స్టీల్, దాని చుట్టూ ఉన్న పరిస్థితులు, ఉద్యమాల కథాంశంతో సినిమా తీయబోతున్నారు. త్వరలోనే దీని గురించి అధికారికంగా మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు.