అమితాబ్ చేతికి ‘హోం క్వారంటైన్‌ స్టాంప్‌’.. వెరైటీగా చిన్నప్పటి ఫోటో షేర్ చేసిన హీరోయిన్..

చేతికి ‘హోం క్వారంటైన్‌ స్టాంప్‌’తో అమితాబ్ బచ్చన్.. చిన్ననాటి ఫోటో షేర్ చేసిన కరీనా కపూర్..

  • Published By: sekhar ,Published On : March 18, 2020 / 06:31 PM IST
అమితాబ్ చేతికి ‘హోం క్వారంటైన్‌ స్టాంప్‌’.. వెరైటీగా చిన్నప్పటి ఫోటో షేర్ చేసిన హీరోయిన్..

Updated On : March 18, 2020 / 6:31 PM IST

చేతికి ‘హోం క్వారంటైన్‌ స్టాంప్‌’తో అమితాబ్ బచ్చన్.. చిన్ననాటి ఫోటో షేర్ చేసిన కరీనా కపూర్..

 

 

కరోనా వైరస్.. ఏ క్షణాన ఏం జరుగుతోందనని ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపడుతున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ.. విదేశాల నుంచి రాకపోకలను నిలిపి వేసింది. 
ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. జాగ్రత్తలు తీసుకునేలా చేపట్టిన ‘హోం క్వారంటైన్‌ స్టాంప్‌’ క్యాంపెయిన్‌‌తో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ చేతులు కలిపారు. హోం క్వారంటైన్‌ స్టాంప్‌ వేసి ఉన్న తన ఎడమచేతిని ఫోటో తీసి ట్విట్టర్‌ పోస్ట్‌ చేశారు బిగ్‌ బీ.

‘ముంబైలో ఓటర్‌ ఇంక్‌తో స్టాంప్‌ వేయడం ప్రారంభించారు. జాగ్రత్తగా.. అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ వైరస్‌ లక్షణాలు గుర్తిస్తే ఒంటరిగా ఉండండి. డాక్టర్లను సంప్రదించండి’ అంటూ ట్వీట్‌ చేశారు. అనుమానిత వ్యక్తులకు అవగాహన కల్పించేలా హోం క్వారంటైన్‌ స్టాంప్‌ కార్యక్రమాన్ని ప్రమోట్‌ చేస్తున్న అమితాబ్‌కు బీఎంసీ ట్విట్టర్‌ ద్వారా ధన్యవాదాలు తెలియజేసింది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తిలో కీలక పాత్ర పోషించే షేక్‌హ్యాండ్‌ గురించి బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ కూడా స్పందించారు.

ఈ మేరకు తన చిన్ననాటి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన కరీనా.. ‘‘ఎవరైనా నాకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వాలని ప్రయత్నించినపుడు.. నేను’’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది. ఇక కరోనా కట్టడిపై కరీనా స్పందించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘‘ఈ ఫోటో చూస్తుంటే.. తైమూర్‌ గుర్తుకు వస్తున్నాడు. మీరప్పుడు ఎంతో ముద్దుగా.. బొద్దుగా ఉన్నారు. అవును మీరన్నట్లు షేక్‌హ్యాండ్‌కు నో చెప్పాల్సిందే’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Me… when someone tries to shake my hand these days! #StayHome #StaySafe #SocialDistancing

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on