Amitabh Bachchan: అమితాబ్ 80వ పుట్టినరోజు రూ.80లకే టికెట్..
ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 80వ బర్త్ డే ఈరోజు కావడంతో దేశవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సోషల్ మీడియా వేదికగా బిగ్-బి కి బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక ఇటీవల బిగ్-బి నటించిన "గుడ్ బై" సినిమా విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

Amitabh Bachchan Good Bye Movie Ticket for 80 Rupees on his 80th Birthday
Amitabh Bachchan: ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 80వ బర్త్ డే ఈరోజు కావడంతో దేశవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సోషల్ మీడియా వేదికగా బిగ్-బి కి బర్త్ డే విషెస్ తెలిపారు. 80 ఏళ్ళ వయసులో కూడా అమితాబ్ వరుస సినిమాలు, టీవీ షోలు చేస్తూ అలరిస్తున్నారు.
Amitabh Bachchan: అమితాబ్‌కి కన్నీళ్లు తెప్పించిన అభిషేక్ బచ్చన్.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో!
ఇక ఇటీవల బిగ్-బి నటించిన “గుడ్ బై” సినిమా విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అమితాబ్ బచ్చన్ 80వ పుట్టినరోజును పురస్కరించుకుని మూవీ టీం అక్టోబర్ 11 మంగళవారం నాడు సినిమా టికెట్ ధరను కేవలం రూ.80లకే అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది.
మీ కుటుంబంతో మా కుటుంబ కథ చిత్రం “గుడ్ బై” సినిమాను రూ.80లకే చూసి బిగ్-బి 80వ పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకుందాం అంటూ ఒక ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న అమితాబ్ బచ్చన్ కి కూతురుగా నటించింది. ఆమె నటిస్తున్న మొదటి హిందీ స్ట్రెయిట్ ఫిల్మ్ ఇది.

Amitabh Bachchan Good Bye Movie Ticket for 80 Rupees on his 80th Birthday