Amitabh Bachchan: అమితాబ్‌కి కన్నీళ్లు తెప్పించిన అభిషేక్ బచ్చన్.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో!

ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 80వ బర్త్ డే ఈరోజు కావడంతో దేశవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా బిగ్-బి కి బర్త్ డే విషెస్ తెలిపాడు. ఇక అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్.. తన తండ్రిని సుర్ప్రైస్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

Amitabh Bachchan: అమితాబ్‌కి కన్నీళ్లు తెప్పించిన అభిషేక్ బచ్చన్.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో!

Amitabh Bachchan getting Emotional for his son Abhishek Bachchan Birthday surprise

Amitabh Bachchan: ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 80వ బర్త్ డే ఈరోజు కావడంతో దేశవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా బిగ్-బి కి బర్త్ డే విషెస్ తెలిపాడు. ప్రస్తుతం ప్రాజెక్ట్-K కోసం వీరిద్దరూ కలిసి పని చేస్తున్న సంగతి మనకి తెలిసిందే.

Amitabh Bachchan: మన ఇద్దరి స్థితి ఒకటే అంటూ.. సామాన్యుడితో పోలుచుకున్న అమితాబ్ బచ్చన్!

ఇక అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్.. తన తండ్రిని సుర్ప్రైస్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. బిగ్-బి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోకు అభిషేక్ వెళ్ళాడు. ఈ ప్రోగ్రామ్ లో సీనియర్ బచ్చన్ ని కంటెస్టెంట్ సీట్ లో కూర్చోబెట్టి, జూనియర్ బచ్చన్ హోస్ట్ సీట్ లో కూర్చుని పలు ప్రశ్నలు అడిగాడు.

ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కు అమితాబ్ సతీమణి జయ బచ్చన్ కూడా రావడం, అభిషేక్ తన తండ్రిపై చిత్రీకరించిన కొన్ని స్పెషల్ వీడియోలను షోలో ప్రదర్శించడంతో.. అవి చూసి అమితాబ్ ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నాడు. ఆ తరువాత అందరి సమక్షంలో బర్త్ డే కేకును కట్ చేశారు బిగ్-బి. ఇందుకు సంబంధించిన ప్రోమోను షో నిర్వాహకులు విడుదల చేయగా, ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.