Kalki 2898 AD : ప్రభాస్ కల్కి నుంచి అమితాబ్ లుక్ రిలీజ్..

నేడు అమితాబ్ పుట్టినరోజు కావడంతో ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఈక్రమంలోనే ప్రభాస్ కల్కి నుంచి..

Kalki 2898 AD : ప్రభాస్ కల్కి నుంచి అమితాబ్ లుక్ రిలీజ్..

Amitabh Bachchan look released from Prabhas Kalki 2898 AD

Updated On : October 11, 2023 / 4:01 PM IST

Kalki 2898 AD : ప్ర‌భాస్ న‌టిస్తున్న సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ సినిమా కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో లోక‌నాయ‌కుడు కమల్‌ హాసన్‌ విల‌న్‌గా క‌నిపించ‌నుండ‌గా దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. నేడు అమితాబ్ పుట్టినరోజు కావడంతో ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఈక్రమంలోనే ప్రభాస్ కల్కి నుంచి అమితాబ్ లుక్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

మోడరన్ టెక్నాలజీ, హిందూ సనాతన ధర్మాన్ని కలుపుతూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కలియుగాంతంలో ఈ మూవీ స్టోరీ మొదలు కాబోతుంది. ప్రభాస్ ఈ సినిమాలో మోడరన్ విష్ణుమూర్తిగా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో అమితాబ్ ‘అశ్వద్ధామ’ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.

Also read : Chiranjeevi : అమితాబ్ బచ్చన్ KBC షోలో చిరంజీవి.. ట్వీట్‌తో హింట్..

 

View this post on Instagram

 

A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)

కాగా ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీ దత్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీని 2024 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామంటూ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ టైంకి సినిమా పనులు ఇంకా పూర్తి అయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఈ మూవీ సంక్రాంతికి రావడం కష్టమని తెలుసుకున్న ఇతర మూవీ మేకర్స్.. తమ సినిమాలను సంక్రాంతి బరిలో నిలిపారు. ఈ కల్కి మూవీ పోస్టుపోన్ అయ్యి వేసవికి వచ్చే అవకాశం కనిపిస్తుంది.