వెయ్యిమందికి సాయం.. అమితాబ్ ఆశ్చర్యపోయారు.. అభినందించారు..
మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)ని అభినందించిన అమితాబ్..

మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)ని అభినందించిన అమితాబ్..
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో సంపాదన కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటైన సంగతి తెలిసిందే. సినీ రంగంలోని రోజువారీ వేతన కార్మికులకు సహాయం చేసేందుకు సీసీసీ సభ్యులు చాలా కష్టపడుతున్నారు.
మంగళవారం ఒక్కరోజే వెయ్యి మంది సినీకార్మికులకు నిత్యావసరాలు అందించారు. దీంతో ఈ టీమ్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ‘ఒకే రోజు వెయ్యి మందికి సరుకులు పంపిణీ చేశారని తెలిసి ఆశ్చర్యపోయాను. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి తమ బాధ్యతగా భావించి ఈ పని చేశారు.
డబ్బు ఉన్నా, సహకరించే మనషులు కావాలి. అమితాబ్ బచ్చన్‌గారు ఈ పంపిణీ విధానం తెలుసుకొని నాకు ఫోన్ చేసి మరీ అభినందించారు. తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, మెహర్ రమేష్‌కి నా ప్రత్యేక అభినందనలు’ అంటూ చిరంజీవి పేర్కొన్నారు.
Read Also : 500 మందికి అన్నం పెట్టిన హీరో..