నేను చావాలని కోరుకుంటారా?.. మీ తండ్రి ఎవరో మీకు తెలియదు.. బిగ్ బి ఫైర్..

బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వీరు ప్రస్తుతం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఐశ్వర్యారాయ్ బచ్చన్, ఆరాధ్య డిశ్చార్జ్ అయ్యారు.
అమితాబ్ తన ఆరోగ్య సమాచారాన్ని అమితాబ్ ఎప్పటికప్పుడు ట్విటర్ ద్వారా వెల్లడిస్తున్నారు. అమితాబ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కొందరు మాత్రం అమితాబ్‌పై ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారట. కోవిడ్-19తో అమితాబ్ మరణించాలని కోరుకుంటున్నారట. ఈ విషయాన్ని తన బ్లాగ్ ద్వారా వెల్లడించిన అమితాబ్ వారికి ఘాటు రిప్లై ఇచ్చారు.
‘‘మీరు కోవిడ్-19తో చనిపోవాలని కోరుకుంటున్నాం’’.. అంటూ కొందరు రాస్తున్నారు. మిస్టర్ అజ్ఞాతవ్యక్తి.. మీ తండ్రి పేరు మీరు రాయలేదు. ఎందుకంటే మీ తండ్రి ఎవరో మీకు తెలియదు’’ అంటూ ట్రోల్స్‌కు పాల్పడే వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.