Amitabh Bachchan : అమితాబ్ బచ్చన్ కి ఆపరేషన్.. ఆందోళనలో అభిమానులు..
బాలీవుడ్ సమాచారం ప్రకారం అమితాబ్ కి ఇటీవల ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో శస్త్ర చికిత్స జరిగిందని తెలుస్తుంది. (Amitabh Bachchan)
Amitabh Bachchan
Amitabh Bachchan : బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కి తాజాగా ఓ శస్త్ర చికిత్స జరిగింది. రెగ్యులర్ గా తన బ్లాగ్ లో తన రోజువారీ లైఫ్ లో జరిగే పలు సంఘటనలను పోస్ట్ చేస్తూ ఉంటారు అమితాబ్. ఈ క్రమంలో అమితాబ్.. శస్త్ర చికిత్స.. ఐసీయూలో నిపుణులైన వైద్యులు.. వైద్య సిబ్బంది సంరక్షణ.. ఆ తర్వాత డిశ్చార్జ్.. ఇంటికి చేరుకోవడం.. అంటూ ఇండైరెక్ట్ గా తన ఆపరేషన్ గురించి రాసుకొచ్చారు.
బాలీవుడ్ సమాచారం ప్రకారం అమితాబ్ కి ఇటీవల ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో శస్త్ర చికిత్స జరిగిందని తెలుస్తుంది. అయితే అది దేనికి సంబంధించింది అనేది మాత్రం వెల్లడించలేదు. దాని గురించి వివరాలు తెలియాల్సి ఉంది.
అలాగే అమితాబ్ ఇంటికి వచ్చాక తన బ్లాగ్ లో.. డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన తర్వాత ఎదురయ్యే సవాళ్లు చాలా కష్టమైనవి. శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి. మీరు ఒక గొప్ప విజేతగా నిలిచినా ఏదో ఒకరోజు ఓటమి మిమ్మల్ని పలకరిస్తుంది. ఇది జీవితంలో అత్యంత కష్టమైన సమయం. కొందరు ధైర్యంగా ఎదుర్కొంటారు, కొందరు లొంగిపోతారు. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి అని రాశారు.
83 ఏళ్ళ వయసులో అమితాబ్ ఆపరేషన్ చేయించుకొని ఇంటివద్ద రెస్ట్ తీసుకుంటున్నారు అని తెలియడంతో అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా అమితాబ్ త్వరగా రికవరీ అవ్వాలని ప్రార్థిస్తున్నారు.
